పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగాతో ప్యాన్ ఇండియా మూవీని గతంలోనే ప్రకటించారు కానీ అతను ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాకే ఇటువైపు రాగలడు. సో ఎంత లేదన్నా ఈజీగా రెండేళ్లు పడుతుంది. ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక అఫీషియల్ కమిట్ మెంట్ ఇచ్చేసిన బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలపబోతున్నాడనే వార్త గత వారం రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే జవాన్ హడావిడిలో ఉన్న యూనిట్ కి సంబంధించిన ఎవరూ దీని గురించి స్పందించలేదు.
తాజాగా షారుఖ్ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతూ బన్నీ ఒక ట్వీట్ చేశాడు. అందరిని మెచ్చుకుంటూ విడివిడి లైన్లు రాసుకుంటూ పోయాడు. దీనికి స్పందించిన అనిరుద్ రవిచందర్ థాంక్ యు బ్రో అంటూ నమస్తే ఉన్న ఎమోజి సింబల్స్ ని గుర్తులుగా పెట్టాడు. అక్కడితో ఆగలేదు. దానికి అల్లు అర్జున్ రెస్పాన్స్ ఇస్తూ కేవలం కృతజ్ఞతలు సరిపోవని, గొప్ప పాటలు కావాలని అన్నాడు. అంటే ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి జవాన్ సాంగ్స్ అంతగా లేవని చెప్పడం. ఇంకో మీనింగ్ ఎలాగూ ఫ్యూచర్ లో కలుస్తున్నాం కాబట్టి నాకు మాత్రం ఆషామాషీ మ్యూజిక్ కుదరదని చెప్పడం.
ఈ సంభాషణ గమనిస్తే బన్నీ అట్లీ కాంబో దాదాపుగా లాక్ అయినట్టే కనిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ వివరాలు బయటికి చెప్పలేదు. ఇప్పుడు జవాన్ లో షారుఖ్ ని హ్యాండిల్ చేసిన తీరు చూశాక ఏ కమర్షియల్ హీరో అయినా ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కోరుకోడు. అందులోనూ పుష్ప లాంటి ఊర మాస్ మసాలా చేశాక బన్నీ తన స్కేల్ ని పెంచే దర్శకుల కోసమే చూస్తాడు. సో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా ఇలా లైనప్ మాములుగా లేదుగా. ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న అల్లు అర్జున్ సెలక్షన్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
This post was last modified on September 14, 2023 1:18 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…