అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇలా ఉంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఒక్కో వీకెండ్లో పరిమితికి మించి సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్ల కోసం కొట్లాటలు జరిగిపోతుంటాయి. పోటీ వల్ల కొన్ని సినిమాలు అసలు ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోతాయి. కొన్ని వీకెండ్స్‌లో ఏమో ఖాళీగా ఉన్న థియేటర్లను వాడుకోరు. కొత్త సినిమా చూద్దామనుకునే ప్రేక్షకులకు అసలు ఆప్షనే లేకుండా చేస్తారు.
ఈ నెలాఖర్లో రావాల్సిన ‘సలార్’ వాయిదా పడటంతో అందరి దృష్టీ ఆ వీకెండ్ మీద పడింది. హడావుడిగా డేట్లు ఇచ్చేశారు. తీరా చూస్తే అక్కడ రష్ మరీ ఎక్కువ అయిపోయింది. దీంతో ముందు డేట్ ఇచ్చుకున్న మ్యాడ్, రూల్స్ రంజన్ సినిమాలను ఇప్పుడు వాయిదా వేశారు. లేటుగా రేసులోకి వచ్చిన స్కంద, చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు ఆ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి.
ఒకే వీకెండ్లో మూడు సినిమాలు అంటే పోటీ తీవ్రంగా ఉన్నట్లే. అది మూడు చిత్రాలకూ అంత మంచిది కాదు. ఇక అక్టోబరు 6న కూడా మినిమం మూడు సినిమాలు రిలీజయ్యేలా ఉన్నాయి. మ్యాడ్, రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు చిత్రాలను అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుసగా రెండు వీకెండ్స్‌లో మూడు చొప్పున సినిమాలు రిలీజవుతుంటే.. ఈ వారమేమో అసలు థియేటర్లను వాడుకునే కొత్త చిత్రాలే కనిపించడం లేదు.
డబ్బింగ్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’కి అసలు పోటీయే లేని పరిస్థితి. ‘చాంగురే బంగారు రాజా’ అనే చిన్న సినిమా పెద్దగా బజ్ లేకుండా రిలీజవుతోంది. ఇక తర్వాతి వారం అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. పూర్తిగా ఆ వీకెండ్‌ను ఖాళీగా వదిలేశారు. సెప్టెంబరు 29, అక్టోబరు 6 తేదీల్లో వచ్చే సినిమాల్లో రెండు మూడు చిత్రాలు రాబోయే రెండు వీకెండ్స్‌కు షెడ్యూల్ అయి ఉంటే వాటికి ప్రయోజనం చేకూరేది. ప్రేక్షకులకూ ఆప్షన్ ఉండేది.
This post was last modified on September 24, 2023 1:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…