మనం థియేటర్ కు ఎందుకు వెళతాం. పెద్ద తెరపై మనకు ఇష్టమైన ఎంటర్ టైన్మెంట్ ని మనసారా ఆస్వాదించేందుకు. ఎంత బిగ్ స్క్రీన్ అయితే అంత ఎంజాయ్ మెంట్ అన్న మాట. ఇప్పటిదాకా ఐమాక్స్, సూళ్లూరుపేటలో వి ఎపిక్ తెరలే పెద్దవనుకుంటున్నాం కానీ ఊహాలకు ఏ మాత్రం అందని అతి పెద్ద రాకాసి స్క్రీన్ లాస్ వెగాస్ లో అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకే వందల కోట్లు ఖర్చయ్యాయంటే ఎక్స్ పీరియన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని తాలూకు వీడియోలు కొన్ని ఆన్ లైన్ లో అప్పుడే హల్చల్ చేయడం మొదలుపెట్టాయి.
దీని విశేషాలు ఏంటంటే ఈ స్క్రీన్ 366 అడుగులు పొడవు 516 అడుగుల వెడల్పు ఉంటుంది. కెపాసిటీ 18 వేల 600 మంది ఒకేసారి సినిమా చూడొచ్చు. చిన్నా పెద్ద కలిపి 1 లక్ష 60 వేల స్పీకర్లు అమర్చారు. 60 ఎఫ్పిఎస్ వేగంతో 18K రెజల్యూషన్ తో కంటెంట్ ప్లే అవుతుంది. దీని మీద మూవీని రన్ చేయాలంటే ఫైల్ సైజ్ అక్షరాల 5 లక్షల GB అంటే ఒళ్ళు జలదరించక మానదు. అక్టోబర్ 6న ‘పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్’తో దీన్ని ప్రీమియర్ చేయబోతున్నారు. ఒకసారి ఇందులో చూస్తే జీవితాంతం మర్చిపోలేని అనుభూతి దక్కుతుందని నిర్వాహకులు అంటున్నారు. టికెట్ ధర ఎంతని ఇప్పుడే అడక్కండి. రివీల్ చేయలేదు. గుండెనొప్పి రావొచ్చు.
ఇందులో చాలా విశేషాలను జోడించబోతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి అత్యాధునిక ఎల్ఈడి సాంకేతికత సహాయంతో గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ని చూపిస్తారట. వినడానికి బాగానే ఉంది కానీ మన దేశంలో ఇలాంటివి ఇప్పుడప్పుడే ఊహించుకోలేం. తెలుగురాష్ట్రాల్లో మనకు ఇప్పటికీ ఒక ఒరిజినల్ ఐమ్యాక్స్ స్క్రీన్ లేదు. ఇతర చోట్ల ఉన్నవి కూడా మరీ ఇంటర్నేషనల్ క్వాలిటీ అయితే కాదు. చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి చోట్ల మాత్రం స్టాండర్డ్ ఎక్స్ పీరియన్స్ ఉంది. మరి పైన చెప్పిన స్క్రీన్లు ఇండియాకు రావాలంటే ఇంకో పాతికేళ్ళు పడుతుందేమో.
This post was last modified on September 13, 2023 6:45 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…