మొదటి మూడు రోజుల వసూళ్లు చూసి తెగమురిసిపోయి మరో గీత గోవిందం తన ఖాతాలో పడిందని ఆనందపడ్డ విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ తత్వం త్వరగానే బోధపడింది. ఖుషి మొదటి సోమవారానికే విపరీతమైన డ్రాప్ మొదలై ఎక్కడా మళ్ళీ పికపయ్యే సూచనలు లేకపోవడంతో నిర్మాతలు ప్రమోషన్లను లైట్ తీసుకున్నారు. ఒకవేళ వైజాగ్ సక్సెస్ మీట్ తర్వాత ఏమైనా పెరుగుదల కనిపించి ఉంటే ఇంకాస్త యాక్టివ్ అయ్యేవాళ్ళేమో కానీ థియేటర్ కలెక్షన్లు చూశాక వాస్తవం అర్థమైపోయి మౌనాన్ని ఆశ్రయించారు. అరకొర వసూళ్లు వస్తున్నా ఖుషి ఫైనల్ రన్ కి దగ్గరగా వచ్చేసింది.
ఎంత లేదన్నా పన్నెండు కోట్ల దాకా థియేట్రికల్ లాస్ తప్పదని ట్రేడ్ అంచనా. ఓవర్సీస్ లో బాగా ఆడినప్పటికీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆశించిన స్థాయిలో దూకుడు కొనసాగించలేకపోవడం దెబ్బ కొట్టింది. విజయ్ సైతం ఊరికే ఫేక్ హడావిడి చేయకుండా, సోషల్ మీడియాలో లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకుండా సైలెంట్ అయ్యాడు. సెప్టెంబర్ 5న కుటుంబాలకు లక్ష రూపాయలు సాయం చేయడం కోసం ట్వీట్ చేసిన గూగుల్ ఫార్మ్ తప్పించి ఆ తర్వాత ఖుషికి సంబంధించి ఎలాంటి ట్వీట్లు కానీ పోస్టులు కానీ చేయలేదు. దీన్నిబట్టి తత్వం త్వరగానే అర్థం చేసుకున్నాడనిపిస్తోంది.
కాకపోతే లైగర్ అంత దారుణంగా ఖుషి పోకపోవడం ఒక్కటే విజయ్ కు దక్కిన పెద్ద ఊరట. తాను ఎలాంటి పాత్రలకు సూట్ అవుతానో ఆడియన్స్ క్లారిటీ ఇచ్చేశారు. దర్శకుడు శివ నిర్వాణ చేసిన పొరపాట్లు తప్పించి విజయ్ దేవరకొండను తప్పు పట్టేందుకు ఏమీ లేదు. ప్రస్తుతం పరశురామ్, గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్న రౌడీ హీరో ఒకటి క్లాస్ మరొకటి యాక్షన్ మాస్ తో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. యునానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకునే మూవీ కోసం తపించిపోతున్న విజయ్ కు ఆ కోరిక వీటితో ఖచ్చితంగా నెరవేరుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అదే జరగాలి మరి.
This post was last modified on September 13, 2023 6:46 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…