‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. అందమైన ముఖవర్చస్సు, చక్కటి శరీర సౌష్టవం, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. మంచి సింగర్ కూడా అయిన రాశి ఆ రకంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన కొంత కాలానికే రాశి తెలుగు కూడా నేర్చుకుని మన వాళ్లకు మరింత దగ్గరైంది.
కెరీర్లో ఒక దశ వరకు మిడ్ రేంజ్ హీరోలతోనే జట్టు కట్టిన రాశి.. ‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సరసనా నటించడంతో ఇక ఆమె కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని అనుకున్నారు. కానీ చిత్రంగా రాశి కెరీర్ తర్వాత తిరోగమనంలో పయనించింది. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్, థ్యాంక్‌యు.. ఇలా ఆమె చివరి మూడు తెలుగు చిత్రాలు ఒకదాన్ని మించి డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో రాశికి తెలుగులో ఛాన్సులు ఆగిపోయాయి. ఏడాది నుంచి కొత్తగా ఆమె ఒక్క కొత్త సినిమా కూడా అందుకోలేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి ఫొటో షూట్లు చేస్తున్నా ఎవరి దృష్టిలో పడట్లేదు. మధ్యలో ఆమె హిందీలో నటించిన ‘ఫర్జీ’తో మంచి పేరే సంపాదించింది.
అక్కడే కాస్త అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ సిద్దార్థ్ మల్హోత్రాతో ‘యోధా’లో నటిస్తున్న రాశి.. తాజాగా విక్రాంత్ మాస్సే లాంటి చిన్న హీరోతో ఓ సినిమా కమిటైంది. తన బేస్‌ను కూడా ముంబయికి మార్చేసినట్లుగా కనిపిస్తున్న రాశి.. టాలీవుడ్ మీద పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. అందం, అభినయం రెండూ ఉన్న ఇలాంటి హీరోయిన్.. ఇంత త్వరగా టాలీవుడ్లో ఫేడవుట్ అయిపోవడం ఆశ్చర్యకరం.
This post was last modified on September 13, 2023 4:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…