ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కానీ మణిరత్నం దర్శకత్వంలో రూపొందబోయే కమల్ హాసన్ 234 గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. 1987 ఎవర్ గ్రీన్ క్లాసిక్ నాయకుడు తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ సాధ్యపడక పోవడంతో అంచనాలు మాములుగా లేవు. గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ తో మళ్ళీ తన సత్తా చాటారు. వరల్డ్ వైడ్ ఇదేమి బ్లాక్ బస్టర్ కాకపోయినా తమిళనాడులో రికార్డులు సృష్టించడంతో స్టార్ హీరోలు తిరిగి ఆయన మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కమల్ మరోసారి చేతులు కలుపుతున్నాడు.
దీనికి సెట్ చేస్తున్న క్యాస్టింగ్ అంచనాలు మరింత పెంచేలా ఉంది. కథలో కీలకంగా నడిచే రెండు పాత్రల కోసం దుల్కర్ సల్మాన్, జయం రవిలను తీసుకునే ప్లాన్ లో ఉన్నట్టు చెన్నై టాక్. ఒక తెలుగు మీడియం రేంజ్ హీరోని పెట్టుకునే ఆలోచన ఉన్నప్పటికీ మణిరత్నం అనుకుంటున్న వాళ్లలో ఎక్కువ డేట్లు ఇచ్చేందుకు మనవాళ్ళు సంసిద్ధంగా లేరట. అందుకే ఫైనల్ గా వీళిద్దరితోనే సెట్ చేయొచ్చని వినిపిస్తోంది. శింబుని తొలుత అనుకున్నా అతనితోనూ కాల్ షీట్ల సమస్య ఉందట. హీరోయిన్ గా త్రిషను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. పీఎస్ 1 & 2 తనకు తెచ్చిన పేరు చిన్నది కాదు.
ప్రస్తుతం వినోత్ డైరెక్షన్ లో యాక్షన్ మూవీ చేస్తున్న కమల్ అది పూర్తి కాగానే మణిరత్నం సెట్లో అడుగు పెడతారు. ఆలోగా స్క్రిప్ట్ లాక్ అయిపోతుంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చబోతున్నారు. పేరుకి అరవ సినిమా అయినా మనదగ్గరా దీనికి భారీ హైప్ వస్తుంది. విక్రమ్ పుణ్యమాని కమల్ మార్కెట్ తిరిగి పుంజుకున్న నేపథ్యంలో నిర్మాతలు డబ్బింగ్ అయినా సరే భారీ మొత్తాలకు రెడీ అంటున్నారు. అన్నట్టు ఈ కమల్ 234లో స్పెషల్ క్యామియోలు ఉంటాయట. ఇదో ట్రెండ్ గా మారిన నేపథ్యంలో ఒకటి రెండు ప్రత్యేక పాత్రలను డిజైన్ చేస్తున్నట్టు టాక్.
This post was last modified on September 13, 2023 9:17 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…