ఈ నెల ఆరంభంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఖుషి’ సినిమా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తర్వాత సినిమా ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తెలుగు వెర్షన్ ఒక్క యుఎస్‌లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది.
నైజాంలో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వెళ్లింది కానీ.. మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్ద మొత్తంలోనే నష్టాలు మిగిల్చిందీ చిత్రం. ఏపీ అంతటా బయ్యర్లకు కన్నీళ్లే మిగిలాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ‘ఖుషి’ సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘ఖుషి’ తమిళంలో బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టిందట. తమిళనాట ‘ఖుషి’ తమిళ వెర్షనే కాక తెలుగు వెర్షన్ సైతం బాగా ఆడినట్లు సమాచారం.
‘ఖుషి’ తమిళనాడులో ఫుల్ రన్లో రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. బాహుబలి లాంటి భారీ చిత్రాల సంగతి పక్కన పెడితే.. తమిళంలో తెలుగు అనువాదాలు ఆడటం అరుదు. ఇలాంటి తెలుగు లవ్ స్టోరీలను అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ‘ఖుషి’ గొప్ప టాక్ కూడా తెచ్చుకున్న సినిమా కాదాయె. అయినా విజయ్‌కి తమిళనాట ఉన్న క్రేజ్, సమంత కూడా బాగా తెలిసిన ఫేస్ కావడం కలిసొచ్చింది.
పాటలు ఆల్రెడీ తమిళంలో హిట్టయ్యాయి. దీంతో ‘ఖుషి’కి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తంగా సినిమా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళనాట ‘హిట్’ స్టేటస్ అందుకుంది. కానీ ఈ చిత్రం హిందీ, మలయాళ భాషల్లో కనీస ప్రభావం కూడా చూపలేదు. ఆ వెర్షన్లు నామమాత్రంగా రిలీజయ్యాయంతే. వాటిని అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.
This post was last modified on September 12, 2023 6:17 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…