కొందరు నటులు చూసేందుకు రూపం ఎలా ఉన్నా ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే విధానం భలే ఉంటుంది. వీళ్లకు కనక సెంటిమెంట్ లాంటిది దర్శక నిర్మాతలకు తోడైతే ఇక అవకాశాలకు ఢోకా ఉండదు. ప్రస్తుతం ఇదే కోవలోకి వస్తున్నాడు జాఫర్ సాధిక్. పేరు చెబితే వెంటనే గుర్తురాడు కానీ ఏదైనా సీన్ ని ఉదాహరణగా చెబితే ఠక్కున ఫ్లాష్ అవుతాడు. జైలర్ లో శివరాజ్ కుమార్ ని కలవడానికి రజనీకాంత్ వచ్చినప్పుడు ఆయన్ని చాకుతో బెదిరించి ఆపుతాడో వ్యక్తి. పొట్టిగా, రౌడీ రేంజ్ లో గెడ్డం మీసాలతో వెరైటీగా అనిపించి నవ్వు భయం రెండూ కలిగేలా చేస్తాడు. ఇందులో బాగానే లెన్త్ దొరికింది.
కమల్ హాసన్ విక్రమ్ లోనూ ఇతనున్నాడు. క్లైమాక్స్ లో రోలెక్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడున్న గుంపులో నుంచి కేకలు పెట్టేది ఇతనే. కొన్ని నిమిషాలే అయినా క్యారెక్టర్ బాగానే పేలింది. కట్ చేస్తే తాజాగా బాలీవుడ్ సెన్సేషన్ గా నిలిచిన జవాన్ లో విజయ్ సేతుపతి అసిస్టెంట్ గా అతన్ని చిరాకు పెడుతూ చివరికి ఆ కారణంగానే ప్రాణాలు కోల్పోయే పాత్రలో బాగానే మెరిశాడు. ఈ మూడు ఆయా హీరోల కెరీర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు కావడం గమనించాల్సిన విషయం. కాకతాళీయంగా జరిగినా లేక కారణం ఇంకేదైనా ఇతని మీద కోలీవుడ్ లో ఆఫర్ల వర్షం కురుస్తోందట.
ఇతని డెబ్యూ తెలుగులోనూ జరిగింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ సైతాన్ లో చాలా ముఖ్యమైన పాత్ర చేశాడు. అయితే ఆశించిన స్థాయిలో అది హిట్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ నటన మాత్రం శభాష్ అనిపించే రేంజ్ లో చేశాడు. ఇండస్ట్రీలో మనదైన రోజు వచ్చినప్పుడు లోపంతో సంబంధం లేకుండా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో జాఫర్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు. గతంలో ఎందరో ఆర్టిస్టులు తమ శారీరక లోపాలనే అస్త్రంగా వాడుకుని గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఈ జాఫర్ కు ఇలాంటి హిట్లు రెండు మూడు పడ్డాయంటే కుదురుకున్నట్టే.
This post was last modified on September 12, 2023 6:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…