Movie News

‘స్కంద’ సైలెంట్ అయితే ఎలా?

రామ్ ‘స్కంద’ రిలీజ్ విషయంలో వెనక్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ముందుగా సెప్టెంబర్ 15 న రిలీజ్ అనుకొని ‘సలార్’ వాయిదాతో ఆ డేట్ లాక్ చేసుకొని సెప్టెంబర్ 28న కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.  సినిమాకు టీజర్ తో మంచి బజ్ వచ్చింది. టీజర్ చూసి బయ్యర్స్ కూడా ఎట్రాక్ట్ అయ్యారు. కానీ ట్రైలర్ తర్వాత కొంత నెగటివిటీ వచ్చింది. టీజర్ లో కొత్తదనం చూపించిన బోయపాటి ట్రైలర్ లో రొటీన్ యాక్షన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంతో మరో ‘వినయ విధేయ రామ’ అంటూ కామెంట్స్ వచ్చాయి. 

ఈ సినిమాకు సంబంధించి ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. ఒక్కో ఏరియా మెల్లగా క్లోజ్ చేస్తున్నారు. ముందు ఉన్నట్టు హై డిమాండ్ లేదు కానీ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రీ బిజినెస్ బాగానే చేసుకుంటున్నారట. ఇక నాన్ థియేట్రికల్ గా సినిమా ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టిందని తెలుస్తుంది. ఏదేమైనా రిలీజ్ కి ఇంకా పాతిక రోజులే ఉంది. ఇంత వరకూ టీం రిలీజ్ కి సంబంధించి  ప్రమోషన్స్ మొదలు పెట్టకుండా సైలెంట్ అయిపోయారు. రామ్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ చేసుకుంటూ ముంబైలో ఉన్నాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మధ్యలో రెండు మూడు రోజులు కేటాయించే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఇరవై రోజుల్లో టీం చాలా ఎగ్రె స్సీవ్ ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. అసలే మాస్ కంటెంట్ ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న టైమ్ ఇది. ఈ నేపథ్యంలో సినిమాకు మంచి ప్రమోషన్స్ చేస్తే భారీ ఓపెనింగ్ రావడం పక్కా. మరి రామ్ , బోయపాటి ప్లాన్ ఏంటి ? అసలు  ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు ? వారికే తెలియాలి.

This post was last modified on September 12, 2023 5:50 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

59 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago