జవాన్ లాంటి ధీటైన పోటీని తట్టుకుని మరీ నిలబడిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్లన్నీ నవీన్ ఒక్కడే మోసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ఇంత కాంపిటీషన్ లోనూ యుఎస్ లో మిలియన్ మార్క్, వరల్డ్ వైడ్ పది కోట్లను దాటడం చిన్న విషయం కాదు. అయితే రిలీజ్ కు ముందు ప్లాన్ చేసుకున్న యాంకర్ సుమ ఇంటర్వ్యూ ను కూడా యువి సంస్థ ఎందుకనో వదల్లేదు. కారణాలు బయటికి చెప్పలేదు. అనుష్క ఎక్కడని నవీన్ పోలిశెట్టిని అడిగినప్పుడు అవుట్ అఫ్ స్టేషనని చెప్పడం తప్పించి క్లారిటీగా సమాధానం ఇవ్వలేదు.
మొత్తానికి సక్సెస్ అనుష్కను కెమరా ముందుకి తెచ్చేసింది. ఇంత విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె స్వయంగా ఇచ్చిన వీడియో బైట్ ని ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు. ఈ గురువారం కేవలం మహిళల కోసం ఉదయం స్పెషల్ షోలు, ఉచిత ప్రదర్శనలు చేయబోతున్న శుభవార్తను కూడా ఆమెతోనే చెప్పించారు. ప్రభాస్ తో వరసగా హిట్లు లేకపోయినా యువి బ్యానర్ కి అనుష్కతో మిర్చి, భాగమతి, ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపంలో హ్యాట్రిక్ దక్కింది. ఆ ముచ్చటనే ప్రత్యేకంగా పోస్టర్లలో వేసుకుని మరీ పబ్లిసిటీ చేయడం గమనించాం.
మరి ఇంత గొప్ప ఫలితం దక్కింది కాబట్టి ఏదైనా సక్సెస్ ఈవెంట్ లాంటిది పెట్టి అనుష్కని తమ ముందు తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ తను అందుబాటులో లేదు కాబట్టి ఇది ఎంతమేరకు సాధ్యమయ్యేది మాత్రం చెప్పలేం. నవీన్ మాత్రం ఇండియాకు తిరిగి రావడం ఆలస్యం హైదరాబాద్ తో మొదలుపెట్టి కీలక కేంద్రాల్లో విజయ యాత్ర చేయబోతున్నాడు. వినాయక చవితి పండక్కు మార్క్ ఆంటోనీ తప్ప పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇంకో వీక్ వసూళ్లు రాబట్టుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం మిస్ చేసుకునేందుకు యువి టీమ్ సిద్ధంగా లేదు. మంచిదే.
This post was last modified on September 12, 2023 4:01 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…