కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28 నుంచి తప్పుకుంది. సలార్ ఆ డేట్ వదులుకున్న వెంటనే కర్చీఫ్ వేసేసి పోస్టర్ కూడా రిలీజ్ చేసిన టీమ్ ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ అదే తేదీని నొక్కి వక్కాణించి చెప్పింది. అయితే ప్రాక్టికల్ గా అలోచించి పోటీలో నలిగిపోవడం కంటే తెలివిగా తప్పుకుని సేఫ్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం బెటరని నిర్ణయం మార్చుకుంది. అక్టోబర్ 6కి షిఫ్ట్ అయిపోయింది. వినాయక చవితి పండగ రేస్ నుంచి స్కంద, చంద్రముఖి 2 ఒకేసారి తప్పుకుని నెలాఖరుకి వెళ్లిపోవడంతో రూల్స్ రంజన్ కి ఇబ్బంది వచ్చి పడింది.
మాస్ సెంటర్స్ లో థియేటర్లు ప్లస్ మాస్ ఆడియన్స్ పరంగా ఆ రెండు సులభంగా పై చేయి సాధిస్తాయి. అలాంటప్పుడు రూల్స్ రంజన్ మీద అంతగా ఫోకస్ రాదు. కిరణ్ అబ్బవరం మార్కెట్ అసలే రిస్క్ లో ఉంది. మీటర్ బాలేదని టాక్ రావడానికి ముందే కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడింది. సో పబ్లిక్ టాక్ తనకు యునానిమస్ గా రావడం చాలా ముఖ్యం. అలా కాకుండా స్కంద, చంద్రముఖి 2 లాంటి మాస్ బొమ్మల మధ్య దిగితే అర్థం లేని రిస్క్ అయిపోతుంది. వాటిలో దేనికి పాజిటివ్ టాక్ వచ్చినా సరే జనాలను కిరణ్ వైపు వచ్చేలా చేయడం మేకర్స్ కి సవాల్ గా మారుతుంది.
వీటికి తోడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1ని నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి భారీ ఎత్తున 29న రిలీజ్ చేస్తున్నారు. స్క్రీన్ల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. సో సేఫ్ గేమ్ అంటే ఆ వారాన్ని పై మూడింటికి వదిలేసి తప్పుకోవడమే. అయితే రూల్స్ రంజన్ కి పోటీ పూర్తిగా తప్పలేదు. సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ నిర్మించిన మ్యాడ్ ని అదే తేదీకి వదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినా సరే మొదటి డేట్ తో పోల్చుకుంటే ఇక్కడ రిస్క్ చాలా తగ్గినట్టే. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన రూల్స్ రంజన్ లో నేహా శెట్టి గ్లామర్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తోంది.
This post was last modified on September 12, 2023 11:28 am
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…