వచ్చే ఏడాది వేసవికి ముందుగా కర్చీఫ్ వేసిన సినిమా దేవర. ఈ సినిమా షూట్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 2024 ఏప్రిల్ 5కు ఈ సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఆ డేట్ టార్గెట్ పెట్టుకుని పక్కాగా ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది టీం.
ఐతే ఈ సినిమాకు ఓ భారీ పాన్ ఇండియా సినిమా ముప్పుగా మారుతుందేమో అన్న టెన్షన్ నడిచింది కొన్నాళ్లుగా. ఆ చిత్రమే.. పుష్ప-2. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో అనూహ్య విజయం సాధించడంతో సీక్వెల్‌పై హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవలే టీంకు రెండు జాతీయ అవార్డులు రావడంతో హైప్ ఇంకా పెరిగింది.
పుష్ప-2 మార్చి 22న వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది కొన్ని రోజులుగా. అంటే దేవరకు రెండు వారాల ముందు పుష్ప-2 అంటే ఆ చిత్రానికి ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా దేవరను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పుష్ప-2 ధాటిని తట్టుకోవడం అంత తేలిక కాదు. హిందీలో ఈ సినిమాకు ఉన్న బజ్ ప్రకారం చూస్తే కొన్ని వారాల పాటు బాగా ఆడే అవకాశం ఉంది.
మార్చి 22న కాకపోయినా.. ఏప్రిల్లో పుష్ప-2 వచ్చినా ఇబ్బందే. అందుకే ఈ సినిమా డేట్ విషయంలో దేవర టీం ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ వాళ్ల టెన్షన్ తీర్చేస్తూ సినిమాను ఆగస్టు 15కు షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం తెలుగులో మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ మరే భారీ చిత్రమూ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాజెక్ట్-కే సెకండాఫ్‌కు వెళ్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. వస్తే పవన్ సినిమా ఓజీ వేసవిలో రావచ్చు. కానీ దేవరకు క్లాష్ అయితే ఉండకపోవచ్చంటున్నారు.
This post was last modified on September 12, 2023 9:25 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…