Movie News

జాతీయ అవార్డొచ్చినా.. ఎవ్వరినీ కలవలేదు

ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రకటన సందర్భంగా సందడంతా టాలీవుడ్‌దే. ఏకంగా 11 అవార్డులను సొంతం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది మన సినీ పరిశ్రమ. ఐతే ఆ అవార్డులను టాలీవుడ్ ఆశించిన స్థాయిలో సెలబ్రేట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ మాత్రమే సంబరాల్లో మునిగి తేలాడు.

ఇండస్ట్రీ జనాలతో పాటు మీడియా వాళ్లకు, సన్నిహితులకు పార్టీలు ఇచ్చాడు. ఇంకెవ్వరూ కూడా పెద్దగా సెలబ్రేషన్స్ చేయలేదనే చెప్పాలి. ఆరు అవార్డులు గెలిచిన ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి సౌండే లేదు. ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవిశ్రీ ప్రసాద్ అయితే అసలెక్కడా కనిపించలేదు. కనీసం అతను ‘పుష్ప’ టీంను అయినా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడా అంటే అది కూడా లేదట.

జాతీయ అవార్డులు ప్రకటించి రెండు వారాలు దాటగా.. ఇప్పటిదాకా తాను హైదరాబాద్‌కు రాలేదని, ‘పుష్ప’ టీంను కూడా కలవలేదని దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. ‘‘జాతీయ అవార్డు సాధించినపుడు నేను చెన్నైలో ఉన్నా. బన్నీ నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుండగానే.. అతడికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినట్లు తెలిసింది. మా ఆనందం రెట్టింపైంది. ఐతే నేను అప్పటికే ఫుల్ బిజీగా ఉన్నా.

ఆ తర్వాత కూడా తీరిక లేదు. దీంతో హైదరాబాద్ రావడానికి అవకాశం లేకపోయింది. ఇంకా పుష్ప టీంను కలవలేదు. సెలబ్రేట్ చేసుకోలేదు. జాతీయ అవార్డు సాధించడానికంటే ముందు ‘పుష్ప’ పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చి గొప్ప ఆదరణం పొందడం ఇంకా పెద్ద అవార్డు. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ‘పుష్ప’ను మించి ‘పుష్ప-2’కు పాటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ‘పుప్ప-2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని దేవి తెలిపాడు.

This post was last modified on September 11, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…

34 minutes ago

కొత్త సంవత్సరానికి పాత సినిమాల స్వాగతం!

ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…

56 minutes ago

టెన్షన్ పడుతున్న తండేల్ అభిమానులు!

తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…

1 hour ago

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…

3 hours ago

శాలువాలతో డ్రెస్సులు..చింతమనేని ఐడియా అదిరింది

రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…

3 hours ago

బందిపోట్లే కాదు…బంధాలూ హైలెటయ్యే డాకు

వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…

4 hours ago