Movie News

డైరెక్టర్ ఉపేంద్ర ఈజ్ బ్యాక్

కన్నడ సినిమా ఈ మధ్య చాలా మారింది. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలు ఆ పరిశ్రమ స్థాయిని పెంచాయి. నవతరం దర్శకులు, నటులు శాండిల్‌వుడ్‌కు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే కన్నడలో రొడ్డ కొట్టుడు సినిమాలు రాజ్యమేలుతున్న 90వ దశకంలోనే వేరే ఇండస్ట్రీల వాళ్లందరూ ఆ పరిశ్రమ వైపు చూసేలా చేసిన వ్యక్తి ఉపేంద్ర.

ఓం, ఎ, ఉపేంద్ర లాంటి సినిమాలతో 90వ దశకంలో అతను మామూలు సంచలనం రేపలేదు. నటుడిగా కంటే దర్శకుడిగా అతను వేసిన ముద్ర బలమైంది. ఓం, ఉపేంద్ర సినిమాలతో అతను ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు కన్నడలో. ఈ చిత్రాలు వేరే ఇండస్ట్రీల్లోనూ అతడికి అభిమానులను సంపాదించిపెట్టాయి. ఐతే హీరోగా బిజీ అయ్యాక ఉపేంద్ర దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. గత రెండు దశాబ్దాల్లో ఉపేంద్ర నుంచి సూపర్, ఉపేంద్ర-2 మాత్రమే రిలీజయ్యాయి. వాటిలో ‘సూపర్’ బాగా ఆడినా.. ఉపేంద్ర-2 నిరాశపరిచింది.

‘ఉపేంద్ర-2’ తర్వాత ఎనిమిదేళ్ల పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉప్పి.. ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ‘యుఐ’ పేరుతో ఉప్పి దాదా కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చడీచప్పుడు లేకుండా మొదలై.. చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి చిన్న ప్రోమో కూడా రిలీజ్ కాలేదు. ‘యుఐ’ టీజర్ లాంచ్ గురించి ఒక వెరైటీ వీడియోతో అప్‌డేట్ ఇచ్చింది ఉప్పి అండ్ టీం.

ఈ సినిమా టీజర్ కావాలంటూ ఉపేంద్ర ఇంటి ముందు అభిమానులు గొడవ చేయడం.. ఉపేంద్ర బయటికి వచ్చి నేరుగా బిగ్ స్క్రీన్ మీద తలెత్తి సినిమా చూడండి, మధ్యలో తలదించుకుని మొబైల్లో ప్రోమో చూడటం ఎందుకు అని అడగడం.. చివరికి అభిమానుల ఒత్తిడికి తలొగ్గి టీజర్ అప్‌డేట్ ఇవ్వడం.. ఇదంతా నిర్మాతలే ప్లాన్ చేసి అభిమానులతో గొడవ చేయించినట్లు చూపించడం.. ఇలా ఈ వీడియోలో ఉపేంద్ర మార్కు స్పష్టంగా కనిపించింది. ఉపేంద్ర సినిమా అంటేనే ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఈ టీజర్ ‌అప్‌డేట్‌తో ఆ విషయం మరోసారి రుజువైంది. మరి చాలా గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్న ఉప్పి.. ప్రేక్షకులు ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on September 12, 2023 2:56 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

1 hour ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago