మహేష్ బాబు కెరీర్ లో అత్యంత దారుణమైన డిజాస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చినా ఫలితం మాత్రం సానుకూలంగా రాలేదు. ఉదయం ఆటకే ఫ్యాన్స్ బాబోయ్ అనేశారు. డ్రామా మరీ ఎక్కువైపోవడంతో జనానికి ఎక్కలేదు. దీని దెబ్బకే అడ్డాల చాలా కాలం ఇండస్ట్రీకి దూరమయ్యారనే టాక్ వినిపించింది. దానికి తగ్గట్టే కొన్నేళ్లు కనిపించకుండా ఉండి తిరిగి నారప్ప కోసం సురేష్ బాబు పిలిపించే దాకా రీ ఎంట్రీ ఇవ్వలేకపోయారు.
ఈ కారణం వల్లే గతంలో బ్రహ్మోత్సవం గురించి ప్రస్తావన తెచ్చే అవకాశం ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప ప్రమోషన్లలో దాటవేశారు తప్పించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పెదకాపు 1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియా అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఓపెన్ అయ్యారు. నటుడు సునీల్ ఓ సందర్భంలో కలిసినప్పుడు చిరాకేసి బ్రహ్మోత్సవం తీశావాని అడిగినప్పుడు చాలా నవ్వుకున్నానని కానీ హిట్టు ఫ్లాపు మన చేతుల్లో ఉండవనే వాస్తవాన్ని తానెప్పుడూ మర్చిపోనని చెప్పారు. ఐఐటిలో పిహెచ్డి చేసేటప్పుడు మంచిని పంచే సినిమాలు తీసే ఉద్దేశంతో కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉన్నానని చెప్పారు.
ఏదైతేనేం మొత్తానికి రూటు మార్చడం వల్ల శ్రీకాంత్ అడ్డాలకు కొత్త బ్రేక్ దక్కేలా ఉంది. పెదకాపు 1లో చూపించిన యాక్షన్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పైగా నటుడిగా కూడా కొత్త ఛాలెంజ్ స్వీకరించారు. సెప్టెంబర్ 29న విడుదల కాబోతున్న పెదకాపు మీద భారీ అంచనాలేం లేవు కానీ ఇప్పటి నుంచి ప్రమోషన్ల స్పీడ్ పెంచి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది. అసలే వారాంతంలో పోటీ విపరీతంగా ఉంది. సాలిడ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరో విరాట్ కర్ణతో ఎలా మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on September 11, 2023 3:10 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…