లోకేష్ కనగరాజ్ మనకు దొరకడు

హీరోయిజంని కమర్షియల్ యాక్షన్ ని అద్భుతంగా బ్యాలన్స్ చేస్తూ సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పని చేయాలని మన హీరోలు ఎదురు చూస్తున్న సంగతి దాచేది కాదు. ప్రభాస్, రామ్ చరణ్ లకు కథలను చెప్పే ప్రయత్నంలో ఉన్నానని అప్పుడెప్పుడో చెప్పాడు కానీ అతనితో చేతులు కలిపేందుకు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు సైతం ఎప్పుడైనా రెడీ అంటారు. అయితే ఊహించుకుని సంతృప్తి చెందడమే తప్ప అతని ప్లానింగ్ చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇది నిజమయ్యే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

ఇవాళ రజినీకాంత్ 171 సినిమా అధికారికంగా ప్రకటించారు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన సన్ పిక్చర్సే దీనికి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నది. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ పేరు ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక్కడ టాలీవుడ్ అభిమానుల బాదేంటంటే కొద్దిరోజుల క్రితం తన కెరీర్ మొత్తం మహా అయితే పది సినిమాలు తీసేసి వెళ్లిపోతానని లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మాములు వైరల్ అవ్వలేదు. అలాంటిది ఇతని నెక్స్ట్ సిరీస్ ఏంటో చూస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. విజయ్ తో ఆల్రెడీ మాస్టర్, లియో తీసిన లోకేష్ ఇంకొక్కటి చేద్దామని మాట తీసుకున్నాడట.

ఇవి కాకుండా సూర్యతో అయితే రోలెక్స్ లేదా తన కలల ఫాంటసీ డ్రీం ప్రాజెక్టు ఒకటి ఉంది. అది పట్టాలెక్కొచ్చు. లేదూ అంటే ఖైదీ 2 ఎలాగూ లైన్ లో ఉంది. ఇవి కాకుండా మానగరం నుంచి లియో తన సినిమాలన్నింటినీ కలుపుతూ లోకేష్ యునివర్స్ ని లాంచ్ చేసే ప్లాన్ ఉంది. విక్రమ్ 2 కోసం కమల్ హాసన్ కి మాట ఇచ్చాడు. ఇవన్నీ అయ్యేలోపు ఈజీగా ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిజంగా సినిమాలు మానేస్తాడా లేక ఫ్రెష్ కాంబోలు సెట్ చేసుకుంటాడా అనేది ఇప్పుడు చెప్పలేం. సో లోకేష్ కనగరాజ్ మనకు దొరకడని ముందే ఫిక్స్ అవ్వడం సేఫ్ అండ్ బెటర్.