Movie News

వింటేజ్ మాఫియాలో ‘జిగర్ తండ’ కలకలం

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా గుర్తుందిగా. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెరైటీ కామెడీ గ్యాంగ్ స్టర్ డ్రామా మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే దీని ఒరిజినల్ వెర్షన్ జిగర్ తండ అంత బ్లాక్ బస్టర్ కాలేదు. అందుకే తమిళంలో బాబీ సింహా లీడ్ రోల్ చేసిందే క్లాసిక్ గా నిలిచిపోయింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ లో టాలెంట్ ఉందని ప్రపంచానికి తెలిసింది దీంతోనే. ఏకంగా రజనీకాంత్ తో పేట ఛాన్స్ కొట్టేశాడంటే అదంతా జిగర్ మహిమే. 2014లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అసలు టైటిల్ ని అలాగే ఉంచేసి దానికి డబుల్ ఎక్స్ అని క్యాప్షన్ జోడించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ద్వారా ఆన్ లైన్లో టీజర్ లాంటి ట్రైలర్ ని వదిలారు. కథేంటో రివీల్ చేశారు. 1975 సంవత్సరం. ఒక ఫిలిం మేకర్(ఎస్ జె సూర్య) కి నిజ జీవిత మాఫియా డాన్ తో సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. దానికి పేరు మోసిన రౌడీ డాన్(లారెన్స్ రాఘవ) ని ఎంచుకుంటాడు. అయితే మంచి నీళ్లు తగినంత సులభంగా మర్డర్లు దొమ్మీలు చేసే అతనితో పని చేయించుకోవడం అంత సులంభం కాదని సదరు డైరెక్టర్ కి అర్థమైపోతుంది. అక్కడి నుంచి షూటింగులను మించిన రియల్ డ్రామా వీళ్ళ జీవితాల్లో మొదలవుతుంది. అదేంటనేది తెలియాలంటే దీపావళి దాకా ఆగాలి.

ఎస్ జె సూర్య, లారెన్స్ కొత్తగా కనిపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ అదే స్టోరీనే తీసుకుని మళ్ళీ కొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతంతో పాటు తిరునావుక్కరసు ఛాయాగ్రహణం క్వాలిటీ కోసం పోటీ పడ్డాయి. విజువల్స్ గట్రా చూస్తుంటే మాస్ ని బలంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న సుబ్బరాజ్ అప్పటి వాతావరణాన్ని అచ్చుగుద్దినట్టు దింపేశాడు. ఇద్దరు హీరోల గెటప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. మొత్తానికి మరో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న హామీ అయితే తన మేకింగ్ తో కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చేశాడు

This post was last modified on September 11, 2023 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

1 hour ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

5 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

5 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

8 hours ago