సున్నితమైన కుటుంబ సంబంధాల నేపథ్యంలో సినిమాలు బాగా తీస్తాడని పేరున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. వెంకటేష్ నారప్ప రీమేక్ అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన తీరు మెప్పు పొందింది. అక్కడి నుంచి రూటు మార్చి సీరియస్ జానర్ వైపు వచ్చేశారు. ఈయన తాజా చిత్రం పెదకాపు పార్ట్ 1. విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ అఖండ ఫేమ్ మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఇంటెన్స్ డ్రామా సెప్టెంబర్ 29 విడుదల కానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చేశారు.
కథకు సంబంధించిన కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చారు. అదో నదీ ఒడ్డున ఉన్న గ్రామం. కులాల మధ్య సమరంలో నిత్యం అక్కడ ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. పెదకాపులతో జరిగే ఆధిపత్యపోరుని అక్కడి పెద్ద మనుషులు(ఆడుకాలం నరేన్-శ్రీకాంత్ అడ్డాల) శాశిస్తు ఉంటారు. అయితే అణిచివేత తప్ప మరో ఉన్నతి ఎరుగని కులానికి చెందిన ఓ యువకుడు(విరాట్ కర్ణ) ఈ వ్యవస్థకు తిరగబడతాడు. అక్కడి నుంచి గొడవలు కొత్త మలుపు తీసుకుంటాయి. ఊచకోతతో మొదలై ఆ ఊళ్ళో కొనఊపిరి తీసుకున్న ప్రతి ఆడబిడ్డ కన్నీటికి బదులు చెప్పాలని తెగబడతాయి. ఆ మలుపులే అసలు స్టోరీ.
విజువల్స్ మొత్తం చాలా ఇంటెన్సిటీతో ఉన్నాయి. గ్రామాల చిచ్చులు ఏ స్థాయిలో ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు శ్రీకాంత్ అడ్డాల. ఆయనే ఒక కీలక పాత్ర పోషించడం మరో ట్విస్టు. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం టెక్నికల్ గా స్టాండర్డ్ ని పెంచాయి. స్కంద, చంద్రముఖి 2లతో పోటీ పడుతున్న పెదకాపులో ఇది మొదటి భాగమే. అంటే కథ మొత్తం ఇందులో చూపించడం లేదన్న మాట. కంటెంట్ కనక క్లిక్ అయితే శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ స్టార్ లీగ్ బ్యాచ్ లోకి రావడం ఖాయమే. చూడాలి మరి ఎలాంటి ఫలితం అందుకుంటారో
This post was last modified on September 11, 2023 12:12 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…