ఇది షారుఖ్ ప్రభావమా మాస్ మహత్యమా

సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రహసనం కొనగిస్తున్న జవాన్ ఇవాళ మరింత దూకుడు చూపిస్తోంది. ఇండియా పాకిస్థాన్ వన్ డే మ్యాచ్ అంటే మాములుగా జనాలందరూ ఇళ్లలో నుంచి బయటికి రారు. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పనున్నా సరే వాయిదా వేసుకోవడమో లేక ముందే పూర్తి చేసుకోవడమో చేస్తారు. కానీ జవాన్ విషయంలో దీనికి పూర్తిగా మినహాయింపు ఇచ్చేశారు. మ్యాచ్ మధ్యాన్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని తెలిసినా సరే చాలా చోట్ల ఆ టైం షోలన్నీ హౌస్ ఫుల్స్ చూపిస్తున్నాయి. నార్త్ నుంచి తెలుగు రాష్ట్రాల దాకా అన్ని చోట్ల ఒకే సీన్.

మూడో రోజు బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా జవాన్ 68 కోట్ల 72 లక్షలతో మరో రికార్డుని ఖాతాలో వేసుకుంది. రెడ్ చిల్లీస్ సంస్థ అధికారికంగా ఈ నెంబర్ ని ప్రకటించింది. సండే నెంబర్స్ దీనికన్నా భారీగా ఉండబోతున్నాయి.  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జవాన్ థియేటర్లలో ఫ్యాన్స్ చేసుకుంటున్న సంబరాలు, హాలు లోపల ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూపించే వీడియోలతో హోరెత్తిపోతున్నాయి. ఇది షారుఖ్ ప్రభావమా అంటే పూర్తిగా వన్ సైడ్ ఆన్సర్ చెప్పలేం. ఎందుకంటే కింగ్ ఖాన్ క్యాలిబర్ కి మాస్ కంటెంట్ తోడవ్వడం వల్ల జరిగిన అరాచకమిది.

అవసరం లేని సాఫ్ట్ కార్నర్ సబ్జెక్టులు ఎంచుకుని జీరో, జబ్ హ్యారీ మీట్స్ సీజల్, దిల్ వాలే లాంటి రాడ్ కంటెంట్ ఎంచుకున్న షారుఖ్ దానికి తగ్గట్టే దారుణమైన ఫలితాలు అందుకున్నాడు. కానీ పఠాన్ నుంచి తనలో అసలైన ఎనర్జీని పసిగట్టాడు. మాస్ ని లక్ష్యంగా పెట్టుకుంటేనే తన స్టార్ డం రాణిస్తుందని అర్థమయ్యింది. ఇది దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే జమానా కాదు. కెజిఎఫ్, విక్రమ్, జైలర్ లాంటి ఎలివేషన్ల హీరోయిజం ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులు. సో దానికి తగ్గట్టే ట్రెండ్ ని ఫాలో అవుతూ మొత్తానికి సరైన దారిలోకే వచ్చాడు. మరి డుంకీలో ఇలాంటివి ఉండవు కాబట్టి అందులో ఎలా కనిపిస్తాడో చూడాలి.