వచ్చే శుక్రవారానికి ముందు అనుకున్న ప్రకారం అయితే మూడు పేరున్న సినిమాలు రావాల్సింది. రామ్-బోయపాటిల ‘స్కంద’తో పాటు అనువాద చిత్రాలు చంద్రముఖి-2, మార్క్ ఆంటోనీ సెప్టెంబరు 15కు రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్య పరిణామాల మధ్య, స్కంద, చంద్రముఖి-2 వాయిదా పడిపోయాయి. ఇక సోలో రిలీజ్‌తో ‘మార్క్ ఆంటోనీ’ పండుగ చేసుకోబోతోందని అనుకుంటే.. లైకా ప్రొడక్షన్స్‌తో విశాల్‌కు ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా ఈ సినిమా రిలీజ్ మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించినట్లు మూడు రోజుల కిందట వార్తలు రావడం తెలిసిందే.
దీంతో ఆ చిత్ర బృందంతో పాటు సినీ ప్రియుల్లో కూడా నిట్టూర్పులు మొదలయ్యాయి. వచ్చే వారం కూడా బాక్సాఫీస్ బోసిపోతుందని బాధ పడ్డారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే.. ‘మార్క్ ఆంటోనీ’ యధాప్రకారం సెప్టెంబరు 15నే రిలీజయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన సినిమా స్టే వార్తలపై విశాల్ ఇంత వరకు స్పందించనే లేదు. ఒక్క రోజు మాత్రం సోషల్ మీడియాలో కూడా సినిమాను ప్రమోట్ చేయడం ఆపేసి ఊరుకున్నాడు.
కానీ తర్వాతి రోజు నుంచి ప్రమోషన్లు కొనసాగిస్తున్నాడు. సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ చేశాడు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం కూడా పెట్టించాడు. ఆదివారం సాయంత్రం నితిన్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జరగబోతోంది. తమిళంలో కూడా ప్రమోషన్లు కొనసాగుతున్నాయి. ఐతే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గత రెండు రోజుల నుంచి రిలీజ్ డేట్ గురించి మాత్రం విశాల్ అండ్ కో మాట్లాడట్లేదు.
పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టుల్లో సెప్టెంబరు 15న సినిమా రిలీజ్ అనే విషయాన్ని ప్రస్తావించట్లేదు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ విషయం ప్రస్తావించట్లేదని తెలుస్తోంది. ఐతే ఈ ఇష్యూ ఒకట్రెండు రోజుల్లో సమసిపోతుందనే అంచనాతో టీం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ ఏమైనా జరుగుతుండొచ్చు. అది జరగ్గానే అధికారికంగా డేట్ ప్రకటించి వచ్చే శుక్రవారమే సినిమాను రిలీజ్ చేసేట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 10, 2023 2:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…