సినిమా అయినా రాజకీయమైనా అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు గెలుపు అంత సులభంగా ఉండదు. అందులోనూ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వసూళ్ల వీరంగం ఆడుతుంటే ఒక రామ్ కామ్ మూవీ ఎదురుగా తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కంటెంట్ ఉంటే ఇదేమి కష్టం కాదని నిరూపిస్తోంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మూడు రోజులకు గాను 9 కోట్ల దగ్గరగా షేర్ అందుకుని బాప్రే అనిపించేసింది. గ్రాస్ చూసుకుంటే ఇది 17 కోట్ల పైమాటే. ఓవర్సీస్ లో ఇవాళ ఆదివారం మిలియన్ మార్క్ లాంఛనం సులభంగా పూర్తవుతుంది.
ఇంకో నాలుగున్నర కోట్లు దాటేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ పోలిశెట్టి ప్రమోషన్ల పరంగా పడిన కష్టానికి తగ్గ ఫలితం కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. నిజానికి జవాన్ తాకిడిని ఇలాంటి మూవీ తట్టుకోగలదానే అనుమానాలే ఎక్కువగా వచ్చాయి. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ రెస్పాన్స్ బాగుండటం గమనించాల్సిన విషయం. విజయ్ దేవరకొండ ఖుషిని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయిన ఎన్ఆర్ఐలు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని మాత్రం అక్కున చేరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ జవాన్ కంటే దీనివైపే మొగ్గుచూపడం అసలు ట్విస్టు.
సో నవీన్ కు హ్యాట్రిక్ పూర్తయినట్టే. అనుష్కకు మంచి కంబ్యాక్ దొరికినట్టే. దీన్ని బట్టి సున్నితమైన అంశాలను టేకప్ చేస్తే క్రమంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే క్లారిటీ వచ్చేసింది. జవాన్ ఊర మాస్ ముందు శెట్టి క్లాస్ ఇంత తట్టుకుని నిలవడం మాములు విషయం కాదు. వచ్చే వారం చాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోనీ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. టాక్ వస్తేనే నిలబడగలిగే కంటెంట్ లవి. సో శెట్టి జంట అంత సులభంగా స్లో అవ్వడం ఉండదు. పైగా వచ్చేది పండగ రోజులు కాబట్టి మళ్ళీ సోమవారం దాక వసూళ్లు లాగేయొచ్చు.ఎంత లాభం మిగులుతుందనేది వేచి చూడాలి.
This post was last modified on September 10, 2023 2:23 pm
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…