ఒక సినిమా వాయిదా వేసినప్పుడు, ఆ ప్రభావం ఎందరి మీదో పడుతుందని తెలిసినప్పుడు దానిపట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. సలార్ పోస్ట్ పోన్ చేసిన సంగతి ఇప్పటిదాకా హోంబాలే ఫిలింస్ అధికారికంగా ప్రకటించనే లేదు. సెప్టెంబర్ 2న సుదీప్ కి బర్త్ డే విషెస్ చెప్పాక ఆ హ్యాండిల్ నుంచి ఎలాంటి ఊసు లేదు. కేవలం అనధికారికంగా డిస్ట్రిబ్యూటర్ వర్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ డేట్ మారబోయే సంగతి కూడా వాళ్లకు మాత్రమే చెప్పారు. మీడియాకు, అభిమానులకు సమాచారమివ్వాలన్న ప్రాధమిక బాధ్యతను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇంత జరుగుతున్నా మౌనమే సమాధానం.
అవతల ఇతర నిర్మాతలందరూ విడుదల తేదీల విషయంలో తలలు బద్దలు కొట్టుకునే రేంజ్ లో ఒత్తిడికి లోనవుతున్నారు. స్కంద లాంటి భారీ బడ్జెట్ చిత్రం సైతం దీనికి మినహాయింపుగా నిలవలేదు. తాము అడిగిన రేట్లు డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన కారణంగా సలార్ నిర్మాతలు ప్రతి విషయంలో ఆలస్యంగా అడుగులు వేశారని ఆల్రెడీ టాక్ ఉంది. ప్రపంచమంతా టీజర్ కోసం ఎదురు చూస్తోందని తెలిసి కూడా కనీసం ప్రభాస్ మొహం సరిగా చూపకుండా డైనోసర్ డైలాగ్ తో సరిపెట్టేశారని, అది చూసాక ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో రేట్లు చెబితే బయ్యర్లు ఎలా ముందుకొస్తారని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.
ఇక్కడ పంపిణీదారులు అడిగిన ధరకు నో అన్నారు కాబట్టి తప్పు వాళ్ళదని చెప్పలేం. ఆదిపురుష్ రిలీజ్ కు ముందు బోలెడు నెగిటివిటీ ఉంటే వాటిని పాటలు, ట్రైలర్ తో పూర్తిగా పోగొట్టింది టి సిరీస్ సంస్థ. ఫైనల్ రిజల్ట్ తర్వాతి సంగతి. అలా సలార్ కు కూడా స్టన్నింగ్ అనిపించే ప్రమోషనల్ మెటీరియల్ ఏదైనా వదిలి అప్పుడు ఇదిగో మా కంటెంట్ ఇది అని డిమాండ్ చేస్తే ఒక పద్దతి. సెట్లో ఫోటోలు, జూనియర్ ఆర్టిస్టులు ఇచ్చే వీడియో బైట్లు హైప్ ఇవ్వవు. మూడు ఫ్లాపుల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా కాబట్టి ప్రతి విషయంలో కేర్ తీసుకోవాలి. కానీ సలార్ కు లోపించింది ఇదే. నవంబర్ రిలీజ్ అంటున్నారు. ఇప్పుడైనా సరైన ప్రణాళిక వేసుకుంటే సమస్యలు రావు.
This post was last modified on September 9, 2023 7:31 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…