2023 సంవత్సరం తెలుగు సినీ అభిమానులకు చాలా వరకు నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులకు ఈ సంవత్సరం ఆశించిన జోష్ ఇవ్వలేదు. టాప్ స్టార్ల సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువగా రిలీజయ్యాయి. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే రెండేసి రిలీజ్‌లు సెట్ చేసుకున్నారు. అందులో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఉత్సాహం కాస్తా.. ‘భోళా శంకర్’ డిజాస్టర్‌తో నీరుగారిపోయింది. బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో హిట్ కొట్టాడు.
‘భగవంత్ కేసరి’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రభాస్ ‘ఆదిపురుష్’తో నిరాశ పరిచాడు. ‘సలార్’ రిలీజ్ సంగతి డోలాయమానంలో పడింది. పవన్ కళ్యాన్ ‘బ్రో’ మూవీతో మమ అనిపించాడు. ఆ సినిమా పట్ల అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాకపోవడం వారి అభిమానులను నిరాశపరిచింది.
ఐతే 2024లో మాత్రం స్టార్ సినిమాల మామూలుగా ఉండేలా లేదు. అభిమానులు కోరుకున్న స్థాయిలో పెద్ద హీరోలు భారీ, క్రేజీ చిత్రాలతో అభిమానులను అలరించబోతున్నారు. ముందుగా సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లాంటి మాస్ మూవీతో అభిమానుల ముందుకు వస్తాడు. వేసవిలో అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప-2’, జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ రిలీజ్ కానున్నాయి.
ఈ రెండూ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదల కానున్నాయి. అవి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతాయని భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లాంటి మెగా మూవీతో రాబోతున్నాడు. దానికున్న హైప్ సంగతి తెలిసిందే. ఇక రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో నిరాశపరిచిన పవన్.. తన స్టామినాకు తగ్గ ‘ఓజీ’తో వచ్చే ఏడాది అభిమానులను పలకరించబోతున్నాడు. దీనిపై అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరోవైపు రామ్ చరణ్ వచ్చే ఏడాదే ‘గేమ్ చేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి.. వశిష్ఠ దర్శకత్వంలో చేసే సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజయ్యే అవకాశముంది. బాలయ్య-బాబీ సినిమా కూడా మంచి క్రేజ్ ఉన్నదే. నాగ్ కూడా ‘నా సామి రంగా’తో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని భావిస్తున్నారు. ఇలా కొత్త ఏడాదిలో టాప్ స్టార్లందరూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గ సినిమాలతో అలరించే అవకాశముంది.
This post was last modified on September 9, 2023 2:22 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…