Movie News

అనుష్క ప్లస్సా.. మైనస్సా

గత వారం వచ్చిన ‘ఖుషి’ సినిమా యావరేజ్‌ టాక్ తెచ్చుకుని వీకెండ్ వరకు మంచి వసూళ్లే రాబట్టింది. కానీ ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడలేకపోయింది. సినిమా ఇంకొంచెం మెరుగ్గా ఉండి ఉంటే ఆ పరిస్థితి రాకపోయేదేమో. ‘ఖుషి’లో ప్లస్సుల కంటే మైనస్‌లు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా ప్రేమకథలకు బాగా సూటవుతుందని, ఆకర్షణ అవుతుందని పేరున్న హీరోయిన్ సమంత ఈ చిత్రానికి మాత్రం ఎసెట్ కాలేకపోయింది.

విజయ్‌తో ఆమెకు అస్సలు జోడీ కుదరలేదని చెప్పొచ్చు. విజయ్‌తో పోలిస్తే వయసులో పెద్దదిగా కనిపించడం.. లుక్స్ ఆకర్షణీయంగా లేకపోవడం మైనస్ అయ్యాయి. ప్రేమకథలకు అత్యంత ముఖ్యమైంది లీడ్ పెయిరే. ఇద్దరికీ జోడీ కుదరడం.. కెమిస్ట్రీ పండడం చాలా ముఖ్యం. ‘ఖుషి’లో అది జరగలేదు. ఇక ఈ వారం వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి కూడా ఇదే సమస్య తలెత్తుతందేమో అన్న సందేహాలు కలిగాయి.

నవీన్ పొలిశెట్టితో పోలిస్తే అనుష్క వయసులో పెద్దది కావడంతో వీరి మధ్య లవ్ స్టోరీ ఏంటో అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు అనుష్క లుక్స్ కూడా ట్రైలర్లో ఆర్టిఫిషియల్‌గా కనిపించడంతో ఆమె వల్ల సినిమా చెడిపోతుందేమో అన్న డౌట్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బుర్రలో అనుమానాలు పెట్టుకునే సినిమా చూశారు ప్రేక్షకులు. ఐతే ఈ సినిమాకు అనుష్క మైనస్ కాలేదు. అలా అని ప్లస్ అయిందని కూడా చెప్పలేం. కానీ అనుష్క వల్ల సినిమా అయితే చెడిపోలేదు.

కథ ప్రకారమే హీరో కంటే హీరోయిన్ వయసు ఐదేళ్లు ఎక్కువ అన్నట్లు చూపించడంతో ఇద్దరి మధ్య వయసు అంతరం అనేది సమస్యగా మారలేదు. పైగా ఫిజికల్ రొమాన్స్ చూపించాల్సిన అవసరం రాకుండా కథను మెచ్యూర్డ్‌గా డీల్ చేయడంతో సమస్యే తలెత్తలేదు. ఇక లుక్స్ పరంగా అనుష్క కొంచెం కృత్రిమంగా కనిపించిన మాట వాస్తవమే అయినా.. తన పెర్ఫామెన్స్‌తో ఆ బలహీనతను స్వీటీ కవర్ చేసింది. పైగా నవీన్ పొలిశెట్టి సినిమాలో లోపాలన్నీ కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేయడంతో సినిమా సాఫీగా సాగిపోయి ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.

This post was last modified on September 9, 2023 10:44 am

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

31 minutes ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

1 hour ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

6 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

6 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

7 hours ago