సోలో రిలీజ్ దక్కిందని విశాల్ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్న టైంలో మార్క్ ఆంటోనీ విడుదలను మదరాస్ హై కోర్టు ఆపిందనే వార్త తెగ అయోమయం రేపుతోంది. ఒక లావాదేవీకి సంబంధించి లైకా ప్రొడక్షన్స్ సంస్థకు 15 కోట్లు విశాల్ చెల్లించాలని, అందుకే న్యాయస్థానం పన్నెండో తేదీకి అతన్ని హాజరు కమ్మని కోరిందని ట్విట్టర్ లో పెద్ద ప్రచారమే మొదలైంది. దీన్ని ఖండిస్తూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తో పాటు నిర్మాత వినోద్ కుమార్ స్పందించారు. సదరు వార్తను ప్రసారం చేసిన టీవీ ఛానల్ మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తూ దీన్ని ప్రచారం చేయొద్దని కోరారు.
నిజానికి ఈ వివాదానికి సంబంధించిన వ్యవహారం గతంలో కోర్టుకు వచ్చిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో సరైన అప్డేట్స్ లేవు. ఇప్పుడేదో హఠాత్తుగా మార్క్ ఆంటోనీ రిలీజ్ ముంగిట్లో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వెనుక ఎవరిదో అజెండా ఉందని చెన్నై మీడియా వర్గాలు అనుమానిస్తున్నాయి. చంద్రముఖి 2 వాయిదా పడిన నేపథ్యంలో మార్క్ ఆంటోనీకి మంచి అవకాశం దొరికిందని సంబరపడుతున్న టైంలో సడన్ గా వచ్చిన ఈ ట్విస్ట్ కన్ఫ్యూజన్ రేపిన మాట వాస్తవం. విశాల్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ప్రస్తుతానికి రాలేదు.
టీమ్ యథాతధంగా ప్రమోషన్లు చేసుకుంటోంది. తెలుగులోనూ ఈవెంట్ తో పాటు మీడియా ప్రెస్ మీట్లకు ప్లాన్ చేస్తున్నారు. అందివచ్చిన ఈ ఛాన్స్ ని పూర్తిగా వాడుకునేందుకు విశాల్ చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ట్రైలర్ చూశాక ఇదేదో వెరైటీ మాఫియా డ్రామాగా గుర్తించిన ప్రేక్షకుల్లో మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. మునుపటి మార్కెట్ లేకపోయినా సరైన హిట్టు ఒకటిపడితే జనాన్ని థియేటర్ కు రప్పించే ఇమేజ్ అయితే విశాల్ కు ఇప్పటికీ ఉంది. ఎస్జె సూర్య స్నేహితుడిగా నటించిన ఈ టైం ట్రావెల్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. హీరో గెటప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి.
This post was last modified on September 8, 2023 11:10 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…