తెలుగు తమిళ సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మహా అయితే వారం రోజులు ముందు మొదలుపెట్టడం చూశాం కానీ లియో నిర్మాతలు ఏకంగా నలభై రోజులకు ముందే ఓవర్సీస్ టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లోనే 10 వేల టికెట్లు ఆల్రెడీ అమ్ముడుపోయాయి. దీన్ని యుఎస్ తదితర దేశాల్లో పంపిణి చేస్తున్న అహింస ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో మీద మాములు అంచనాలు లేవు. రజినీకాంత్ జైలర్ నమోదు చేసిన రికార్డులు బద్దలు కొట్టేది ఇదేనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అక్టోబర్ 19న లియో రాబోతోంది. ఇంత ముందస్తుగా స్క్రీన్లను లాక్ చేసుకుని ఆన్ లైన్ సేల్స్ చేయడం చాలా మంచి ఎత్తుగడ. ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవ్వడమే కాకుండా కాంపిటీషన్ లో ఉన్న వేరే సినిమాల కంటే ముందు దీనివైపే చూసే ఛాన్స్ ఉంటుంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీలో ఉన్న నేపథ్యంలో లియో టీమ్ చాలా స్ట్రాటజీతో ప్లాన్ చేసుకుంటోంది. బాలయ్య, రవితేజలకు కంటెంట్ అండ్ మార్కెట్ పరంగా క్రేజ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని తేలిగ్గా తీసుకోకుండా తనదే పైచేయి కావాలనే ప్లాన్ లో భాగంగా ఇలా స్కెచ్ వేసుకుంది. మంచి ఆలోచనే.
క్రమంగా మన నిర్మాతలు కూడా ఇలాంటి ఎత్తుగడలే అనుసరించాలి. సలార్ ఇప్పుడంటే వాయిదా పడింది కానీ గత వారం వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మిలియన్ మార్క్ వైపు పరుగులు పెట్టింది. ఒకవేళ పోస్ట్ పోన్ కాకపోయి ఉంటే ఇండియన్ సినిమాలోనే కొత్త బెంచ్ మార్క్ వచ్చేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, టాప్ గన్ మావెరిక్ లాంటి వాటికి మన దేశంలోనూ నెల ముందు బుక్ మై షో, పేటిఎంలో టికెట్లు పెట్టారు. అదే తరహాలో ఇకపై పెద్ద హీరోలకు పెడితే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on September 8, 2023 9:10 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…