ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయమయ్యాడు. తర్వాత చకచకా సినిమాలు చేశాడు. కానీ ‘బేబీ’ తర్వాత ఆనంద్ పేరుకి ముందు వినిపించే విజయ్ దేవరకొండ పేరు తొలగిపోయింది. 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాతో ఆనంద్ కి కొత్త గుర్తింపు వచ్చేసింది. ఈ సినిమా టైమ్ లోనే ‘గం గం గణేశా’ అనే మరో కాన్సెప్ట్ సినిమా చేశాడు ఆనంద్.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. నవంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంతతో సోషల్ మీడియాలో రిలీజ్ చేయిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆనంద్ మాస్ కేరెక్టర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్ మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉండబోతుందట. ఇప్పుడు బేబీ సక్సెస్ ఆ సినిమాకి అడ్వాంటేజ్ అవ్వబోతుంది.
‘బేబీ’బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇంకా వేగం పెంచబోతున్నాడు ఆనంద్. ఇప్పటికే రెండు మూడు స్టోరీస్ లాక్ చేసి నెక్స్ట్ లైనప్ సెట్ చేసేసుకున్నాడు. అందులో ఒకటి తెలుగు , తమిళ్ బై లింగ్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. మరి బేబీ సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ ఇకపై ఎలాంటి విజయాలు అందుకుంటాడో ? తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.
This post was last modified on September 8, 2023 7:43 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…