నవీన్ పొలిశెట్టి.. నిన్న ఉదయం నుంచి తెలుగు సినిమా వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న పేరు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని అతను ఒంటి చేత్తో నిలబెట్టాడు అంటే అతిశయోక్తి కాదు. ఇది కంటెంట్ ఉన్న సినిమానే అయినప్పటికీ.. కొంచెం డల్లుగానే సాగే సినిమాకు మంచి ఊపు తెచ్చింది మాత్రం నవీనే. సిద్ధు పాత్రలో అతడి పెర్ఫామెన్స్ చూసి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. స్టాండప్ కమెడియన్ అంటే అచ్చం ఇలాగే ఉంటాడు అనిపించేలా.. ఆ పాత్రను ఓన్ చేసుకుని అతను పండించిన వినోదం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇలాంటి యునీక్, నేచురల్ పెర్ఫామర్స్ తెలుగులో చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. ఏదో క్యారెక్టర్ ఇచ్చారు.. దర్శకుడు చెప్పింది చేసుకుపోదాం అని కాకుండా.. ఆ పాత్రను అర్థం చేసుకోవడమే కాదు.. ఎంతో రీసెర్చ్ చేసి స్టాండప్ కమెడియన్ అంటే ఇలా ఉండాలి అనేలా దాన్ని పండించాడు నవీన్. చాలా మామూలు సన్నివేశాలు, జోకులను కూడా నవీన్ తన టైమింగ్‌తో ఎంటర్టైనింగ్‌గా మార్చాడు అంటే అతిశయోక్తి కాదు. ఒక నటుడికి టైమింగ్ అనేది ఎంత ముఖ్యమో నవీన్‌ను చూస్తే అర్థమవుతంది. అనుష్క పాత్ర పరిచయంతో మొదలయ్యే సినిమా.. నవీన్ వచ్చే వరకు నెమ్మదిగానే సాగుతుంది. కానీ అతను తెర మీద కనిపిస్తాడో లేదో.. ఒక్కసారిగా జోష్ వస్తుంది.
ఇక అక్కడ్నుంచి చివరి వరకు తాను కనిపించే ప్రతి సన్నివేశంలోనూ నవీన్ ఎంటర్టైన్ చేస్తూ సాగుతాడు. కామెడీ సీన్లలో ఎంత బాగా నవ్విస్తాడో.. చివర్లో ఎమోషనల్ సీన్లలో కూడా అంత బాగా భావోద్వేగాలు పండించాడు నవీన్. ఇంత టాలెంట్ దాచుకుని చాలా ఏళ్లు ప్రేక్షకుల దృష్టిలో పడకపోవడం ఆశ్చర్యకరం. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నుంచి ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్న నవీన్.. ఇక నుంచి ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
This post was last modified on September 8, 2023 5:44 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…