Movie News

హిందీ ప్రేక్షకుల కరవు.. షారుఖ్‌కి వరం

హిందీ ప్రేక్షకుల అభిరుచి గత కొన్నేళ్లలో చాలా మారిపోయింది. ఇదంతా సౌత్ సినిమాల పుణ్యమే అని చెప్పాలి. అప్పటిదాకా క్లాస్ సినిమాలకే ఎక్కువ పట్టం కట్టేవాళ్లు హిందీ ఆడియన్స్. మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా ఎలివేషన్లు మరీ ఎక్కువగా ఉండేవి కావు. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక గిరి గీసుకుని కూర్చునేవాళ్లు అక్కడి ఫిలిం మేకర్స్.

కానీ ‘బాహుబలి’ దగ్గర్నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఉన్న మజా ఏంటో హిందీ ఆడియన్స్‌కు అర్థమైంది. హీరో ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకుల్లో ఎలా గూస్ బంప్స్ తీసుకురావచ్చో మన దర్శకులు చూపించారు. యూట్యూబ్‌లో సౌత్ మసాలా సినిమాలకు బాగా అలవాటై.. క్లాస్‌గా, హడావుడి లేకుండా సాగిపోయే హిందీ సినిమాలు రుచించని పరిస్థితి తలెత్తింది. దీంతో బాలీవుడ్ సినిమాల శైలి కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐతే ఈ శైలిని అందరు బాలీవుడ్ డైరెక్టర్లూ అడాప్ట్ చేసుకోలేకపోయాడు. షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ తీసిన సిద్దార్థ్ ఆనంద్ మాత్రం మారిన హిందీ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకున్నాడు. సౌత్ స్టైల్‌ను బాగానే నేర్చుకున్నాడు. ఎలివేషన్లు, గూస్ బంప్స్ మూమెంట్స్‌తో ‘పఠాన్’ను నింపాడు. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.

ఇప్పుడు షారుఖ్.. నేరుగా సౌత్ డైరెక్టర్ అయిన అట్లీ‌తోనే జట్టు కట్టాడు కాబట్టి మరో మసాలా సినిమా అందించగలిగాడు. బాలీవుడ్ స్టార్లు ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని కరవులో ఉన్న హిందీ ఆడియన్స్ వరుసగా రెండో షారుఖ్ చిత్రానికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ‘జీరో’ సినిమా టైంకి ఎలాంటి చిత్రాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్న షారుఖ్.. ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే మింగుడు పడటం లేదు. ఇకపై బాలీవుడ్ స్టార్లందరూ ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ల వెంట పడితే ఆశ్చర్యం లేదు. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

పంజా విసురుతున్న ఓవర్సీస్ పుష్ప

ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…

1 hour ago

రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి ఎత్తేస్తాం: రాహుల్‌

దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితి 50 శాతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏ రిజ‌ర్వేష‌న్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వ‌డానికి…

3 hours ago

100 కోట్ల వసూళ్లకు బన్నీ వాస్ హామీ

తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…

4 hours ago

అసలైన దీపావళి విన్నర్ ఇదే..

ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…

5 hours ago

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే.. టీడీపీ స్ట్రాట‌జిక్ స్టెప్‌!

మ‌రో వారంలో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి పూర్తిగా బ‌డ్జెట్ స‌మావేశాలేన‌ని కూట‌మి స‌ర్కారు చెబుతోంది. వ‌చ్చే మార్చి…

5 hours ago

నాని ‘ప్యారడైజ్’ వెనుక అసలు కహాని

దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…

6 hours ago