Movie News

ఇలాంటి సినిమాకు 4-4.5 రేటింగ్సా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కొత్తదనం ఉండదని.. రొటీన్ మాస్ మూవీసే తీస్తారని వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఎంత చిన్న చూపు ఉండేదో తెలిసిందే. ముఖ్యంగా ఇటు బాలీవుడ్ వాళ్లు, అటు కోలీవుడ్ వాళ్లు మన సినిమాలను చులకనగా చూసేవారు. అక్కడి క్రిటిక్స్ అయితే మన సినిమాల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రేంజే మారిపోయింది. ఓవైపు వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలు తీస్తూనే ఇంకో వైపు.. కమర్షియల్ సినిమాలను కొత్త పుంతలు తొక్కిస్తూ.. వేరే ఇండస్ట్రీలు అందుకోలేని స్థాయికి వెళ్లిపోయింది టాలీవుడ్.

అన్నీ అని కాదు కానీ.. మన సినిమాలు కొన్ని దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇదే సమయంలో హిందీ, తమిళ సినిమాల క్వాలిటీ నానాటికీ పడిపోతోంది. తెలుగు సినిమాల స్థాయిలో అక్కడి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందట్లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమాకు కొంచెం బజ్ క్రియేట్ అయితే, పాజిటివ్ టాక్ వస్తే చాలు.. వాటిని అక్కడి క్రిటిక్స్ మామూలుగా లేపట్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలను చూసి రొటీన్, రొడ్డకొట్టుడు అన్న వాళ్లే.. ఇప్పుడు తమ భాషల్లో అలాంటి సినిమాలు వస్తే వాటిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు.

4 ప్లస్ రేటింగ్స్ ఇచ్చి ఆహా ఓహో అని కొనియాడుతున్నారు. తాజాగా రిలీజైన ‘జవాన్’ సంగతే చూద్దాం. సౌత్ ఇండియాలో వచ్చిన పాత సినిమాలను అటు ఇటు తిప్పి మంచి కమర్షియల్ ప్యాకేజీలు అందిస్తాడని పేరున్న తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. కంటెంట్ పరంగా చూస్తే ‘జవాన్’ యావరేజ్ అనడంలో సందేహం లేదు.

ఈ చిత్రానికి మన క్రిటిక్స్ కంటెంట్‌కు తగ్గట్లే 2.5, 2.75 రేటింగ్స్ ఇచ్చారు. కానీ బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు మాత్రం 4, 4.5 రేటింగ్స్ ఇచ్చి ఈ చిత్రాన్ని జిజాంటిక్ బ్లాక్‌బస్టర్ లాంటి పదాలతో కొనియాడుతున్నారు. ఇది తమిళ దర్శకుడు తీసిన సినిమా కావడం వల్ల తమిళ క్రిటిక్స్ కూడా 3.5, 4 రేటింగ్స్ ఇచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. కంటెంట్ పరంగా చూస్తే 3 రేటింగ్ కూడా ఎక్కువ అయిన సినిమాకు వీళ్లు ఇస్తున్న ఎలివేషన్ చూసి తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

This post was last modified on September 8, 2023 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

3 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

3 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

4 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

4 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

5 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

5 hours ago