వేగంగా సినిమాలు చేయడంలో మంచి దూకుడు మీదున్న కిరణ్ అబ్బవరంకు ఇటీవలే మీటర్ షాక్ ఇచ్చింది కానీ దాన్నుంచి వేగంగా కోలుకుని రూల్స్ రంజన్ తో వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అబ్బాయి రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సలార్ తప్పుకోవడంతో వెంటనే ఆ డేట్ తీసేసుకున్న టీమ్ దీని మీద మంచి అంచనాలతో ఉంది. ముఖ్యంగా ఇష్టసఖుడా పెదవిచ్చేయ్ పాట ఛార్ట్ బస్టర్ అయ్యాక ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు. కథేంటో క్లుప్తంగా చెప్పేశారు.
తల్లి పాలు తాగించి పెంచితే తండ్రి మందు పోసి ఓదారుస్తాడనే నాన్న(గోపరాజు రమణ)గారాబంలో పెరుగుతాడు రంజన్(కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ముంబై వస్తాడు. కాలేజీలో తానెంతో ఇష్టపడిన అమ్మాయి సనా(నేహా శెట్టి)ఇక్కడ కలుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. స్వంత ఊరికి వెళ్లిన రంజన్ కు స్నేహితుల పెళ్లిళ్లు, వాళ్లలో జరిగిన మార్పులు చూసిన ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఇతనికి నిజ జీవితంలో గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం విచిత్రంగా ఉంటారు. వీళ్ళ మధ్య జరిగేదే స్టోరీ.
కామెడీతో పాటు యూత్ ఫుల్ ఎలిమెంట్స్ దట్టించిన రూల్స్ రంజన్ లో కిరణ్ అబ్బవరం ఈసారి కాస్త సీరియస్ టచ్ ఉన్న రోల్ ని ఎంచుకున్నాడు. అయితే మందు తాగి అల్లరి చేసే అమ్మాయిల మధ్య వెరైటీ రొమాన్స్ కూడా పొందుపరిచారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష కామెడీ భాగాన్ని మోయగా బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ తో ఓ కీలక పాత్ర చేయించడం విశేషం. అమ్రిష్ సంగీతం ఆల్రెడీ రీచ్ అవుతోంది. ఆసక్తి కలిగేలా ట్రైలర్ బాగానే ఉంది. ఇదే స్థాయిలో వినోదాన్ని పంచితే కిరణ్ అబ్బవరంకు హిట్ పడ్డట్టే. రామ్ స్కందతో పాటు మ్యాడ్, పెదకాపు పార్ట్ 1 నుంచి పెద్ద పోటీనే ఎదురుకాబోతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…