ఊహించిన దానికన్నా భారీగా ఫస్ట్ డే జవాన్ ఊచకోత మాములుగా జరగలేదు. దేశమంతా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ షాక్ ఇచ్చేలా సాగగా సాయంత్రం ఆటలు, సెకండ్ షోలకు ప్రధాన కేంద్రాలన్నీ హౌస్ ఫుల్స్ తో కిక్కిరిసిపోయాయి. తక్కువ బడ్జెట్ లో తీసినా మాస్ నచ్చే అంశాలు ఉండటంతో గదర్ 2కే అయిదు వందల కోట్లు కుమ్మరించిన ప్రేక్షకులు ఏకంగా షారుఖ్ ఖాన్ ని డ్యూయల్ రోల్ విశ్వరూపం చూపిస్తే ఆగుతారా. అదే నిన్న కలెక్షన్లలో ప్రతిబింబించింది. గురువారం విడుదల కావడంతో లాంగ్ వీక్ ని కలుపుకుని రికార్డులను పాతరేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్ని వెర్షన్లు కలిపి నిన్న జవాన్ సుమారు 75 కోట్ల దగ్గరగా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఒక్క హిందీ నుంచే 60 కోట్ల 70 లక్షలు రాగా, తెలుగు 6 కోట్ల 40 లక్షలు, తమిళం 5 కోట్ల 50 లక్షలకు పైనే లెక్క వచ్చిందని ప్రాధమిక సమాచారం. కనీసం 26 లక్షల 90 వేల టికెట్లు అధికారికంగా అమ్ముడుపోయాయట. వీటిలో బ్లాక్ లో అమ్మినవి కలపలేదు. మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో సింగల్ స్క్రీన్ థియేటర్లలో వందలాది ఆడియన్స్ కింద కూర్చుని చూశారు. అవి కౌంట్ లోకి రావు. ఒకవేళ ఇవి కలిపితే ఈ నెంబర్ ఇంకా మతిపోయేలా ఉంటుందట.
పఠాన్ మొదటి రోజుని పెద్ద మార్జిన్ తో దాటేసిన జవాన్ కు పోటీ లేకపోవడం బాగా కలిసి వస్తోంది. తెలుగు తమిళంలో రిలీజులు ఉన్నప్పటికీ వాటికి యునానిమస్ గా మాస్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడంతో జనాలు జవాన్ నే మొదటి ఛాయస్ గా పెట్టుకున్నారు. ఇవాళ కొంత స్లో ఉన్నప్పటికీ కౌంటర్ బుకింగ్స్ తో ఫుల్స్ పడుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఫుల్ రన్ లో ఏవి క్రాస్ చేస్తుందో ఇప్పుడే చెప్పలేం కానీ దగ్గర్లో మరో బాలీవుడ్ మూవీ లేకపోవడంతో కనీసం రెండు మూడు వారాల పాటు షారుఖ్ వీర విహారం కన్ఫర్మ్ అయినట్టే. చాలా చోట్ల అదనంగా స్క్రీన్లు తోడవుతున్నాయి.
This post was last modified on September 8, 2023 11:56 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…