ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి హరి హర వీరమల్లు , మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ , ఇంకొకటి OG. ఈ మూడు సినిమాళ్లో పవన్ ముందు మొదలు పెట్టిన సినిమా ‘హరి హర వీరమల్లు’. పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో దాదాపు 80 నుండి 100 వరకూ ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. కానీ షూట్ ఇంకా ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో పవన్ ఆ సినిమాను పక్కన పెట్టి మరో రెండు ప్రాజెక్ట్స్ కి డేట్స్ ఇస్తున్నాడు.
పవన్ కి గబ్బర్ సింగ్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఒక అభిమాని పవన్ ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలాగే చూపించి మెప్పించాడు. అందుకే హరీష్ కి మళ్ళీ డేట్స్ ఇచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టాడు పవన్. ఈ సినిమా కంటే వెనుక మొదలైన సుజీత్ సినిమా OG షూట్ కూడా రెండు, మూడు షెడ్యూల్స్ అయ్యాయి. సుజీత్ ఐడియాస్ కి పవన్ ఎప్పటికప్పుడు ఇంప్రెస్ అవుతున్నాడట.
నిజానికి హరీష్ కి అలాగే సుజీత్ కి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇస్తూ రెండు సినిమాలను ఒకే టైమ్ లో పూర్తి చేస్తున్నాడు పవన్. అయితే ఈ రెండు సినిమాలకు పవన్ కావల్సిన డేట్స్ ఇస్తుండటానికి కారణం దర్శకులే. హరీష్ వర్క్ ఆల్రెడీ పవన్ కు తెలిసిందే. ఇక సుజీత్ వర్క్ కి బాగా ఇంప్రెస్ అవుతున్నాడట పవర్ స్టార్. తన రైటింగ్ , టేకింగ్ కి ఫిదా అయ్యాడట. అందుకే ఉస్తాద్ తో పాటు OG కి కూడా డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలే OG షెడ్యూల్ కంప్లీట్ చేసి తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాడు పవన్. మరి పవర్ స్టార్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ దర్శకులు ఎలా ప్రూవ్ చేసుకుంటారో ?
Gulte Telugu Telugu Political and Movie News Updates