మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు అనే గుర్తింపుతోనే చాన్నాళ్ల సినిమాలు చేసిన సుధీర్ బాబు.. సమ్మోహనం దగ్గర్నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో సాగిపోతున్నాడు. ఐతే సరైన కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న సుధీర్‌కు ఆ ఆశే తీరట్లేదు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్.. ఇలా వరుసగా సుధీర్ సినిమాలు నిరాశ పరిచాయి. వీటి తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా మామామశ్చీంద్ర.
నటుడు, రైటర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ అన్నీ కూడా వైవిధ్యంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే ఇంట్రెస్టింగ్ టీజర్ తర్వాత ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కొన్ని నెలల నుంచి సైలెంట్‌గా ఉంది చిత్ర బృందం. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అప్‌డేట్‌తో ప్రేక్షకులను పలకరించింది మామా మశ్చీంద్ర టీం. ఈ చిత్రాన్ని అక్టోబరు 6న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల చివరి వారంలో చాలా సినిమాలు రిలీజవుతుండగా.. ఆ తర్వాత, దసరాకు మధ్యలో పెద్దగా డిమాండ్ లేదు.
ఆ టైం చూసి మామా మశ్చీంద్రను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే సుధీర్ సినిమాకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. ఇప్పటికే హర్షవర్ధన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయగా.. అది విడుదలకు నోచుకోలేదు. ఈసారి ఒక వెరైటీ కథతో అతను సినిమా తీశాడు. ఈ సినిమాలో సుధీర్ రకరకాల అవతారాల్లో కనిపించనున్నాడు. ముఖ్యంగా బొద్దుగా ఉన్న లుక్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. మరి సుధీర్‌కు ఈ సినిమా అయినా కోరుకున్న సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on September 7, 2023 9:55 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…