రేపు విడుదల కాబోతున్న జవాన్ ఫీవర్ మాములుగా లేదు. ఊహించని విధంగా మాస్ మానియా అంతకంతా పెరుగుతూ పోతోంది. ఎన్నడూ లేనిది తెలుగు రాష్ట్రాల్లో ఒక హిందీ డబ్బింగ్ సినిమాకు ఉదయం 5 గంటల షో వేయడం బహుశా ఇదే మొదటిసారని చెప్పాలి. అయినా సరే టికెట్లు సులభంగా దొరకడం లేదు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పఠాన్ గ్రాస్ ని సులభంగా దాటేస్తుందనే అంచనా ఇవాళ అర్ధరాత్రి లోపే జరిగిపోయేలా ఉంది. రోజుల నుంచి గంటల్లోకి మారిపోయిన జవాన్ కౌంట్ డౌన్ కు సంబంధించిన మరికొన్ని లీక్స్ ఇప్పటికే ఉన్న ఎగ్జైట్ మెంట్ ని మరింత పెంచేలా ఉన్నాయి.
వాటి ప్రకారం ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ ఒక క్యామియో చేశాడట. అతని పాత్ర పేరు ధర్మేశ్వర్. రెండో షారుఖ్ ఖాన్ ఒక పెద్ద మిషన్ మీద శత్రువులతో పోరాడుతున్న క్రమంలో అతనికి సహాయంగా విజయ్ క్యారెక్టర్ ఓ రేంజ్ ఎలివేషన్ తో ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ యూనిట్ నుంచి లీకవుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదు. హిందీ వెర్షన్ లో సంజయ్ దత్ తో చేయించరట. తెలుగులో అల్లు అర్జున్ కోసం అడిగితే సానుకూల స్పందన రాలేదని తెలిసింది. తెరపై ఏమైనా ట్విస్టు ఇస్తారేమో చూడాలి.
ఇక్కడ చెప్పిన దాంట్లో సగం నిజమైనా చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అసలే ఈ మధ్య కొన్ని నిముషాలు కనిపించే క్యామియోలు ఆడియన్స్ ని తెగ థ్రిల్ కి గురి చేస్తున్నాయి. విక్రమ్ లో సూర్య, జైలర్ లో శివరాజ్ కుమార్ లు ఎంత హెల్ప్ అయ్యారో మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. ఇప్పుడీ జవాన్ లోనూ అదే తరహాలో పేలితే మాత్రం షారుఖ్ సునామికి విజయ్ హల్చల్ తోడయ్యి రచ్చ జరగడం ఖాయం. మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన జవాన్ లో నయనతార, విజయ్ సేతుపతి ఇతర తారాగణం కాగా అనిరుద్ రవిచందర్ బీజీఎమ్ మీద భారీ అంచనాలున్నాయి.
This post was last modified on September 6, 2023 8:10 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…