ఖుషి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ నిన్న వైజాగ్ లో జరిగిన సక్సెస్ ఈవెంట్ లో వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలను పంచాలని నిర్ణయించుకున్నానని వేదిక మీద ప్రకటించడం పెద్ద చర్చకే దారి తీసింది. ఇది పూర్తిగా సద్దుదేశంతో చెప్పినదే అయినా కొంత పాజిటివ్ గా ఇంకో వర్గంలో నెగటివ్ గా వెళ్తోంది. నిన్న ఇచ్చిన మాట ప్రకారం విజయ్ టీమ్ ఒక గూగుల్ ఫార్మ్ తయారు చేసి ఎవరికైతే లక్ష రూపాయలు అవసరమని భావిస్తున్నారో వాళ్ళ వివరాలు తీసుకుని టీమ్ ద్వారా వెరిఫై చేయించి ఆ తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరికి సహాయం అందాలో నిర్ణయం తీసుకుంటారు.
దీనికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కం ప్రొడక్షన్ కంపనీ అభిషేక్ పిక్చర్స్ స్పందించింది. గతంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ని పంపిణి చేయడం ద్వారా తమకు 8 కోట్ల నష్టం వచ్చిందని, ఇప్పుడు సహృదయంతో కుటుంబాలకు ఎలాగైతే కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారో అలాగే మమల్ని మా బయ్యర్లను కాపాడతారని ఆశిస్తున్నామని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. నిర్మాత కెఎస్ రామరావు తీసిన ఈ డిజాస్టర్ వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని పలు ఇంటర్వ్యూలలో అభిషేక్ నామా గతంలోనే చెప్పారు. ఇప్పుడిలా పబ్లిక్ గా అడిగేసి షాక్ ఇచ్చారు.
దీనికి విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎవరో చిన్నా చితకా డిస్ట్రిబ్యూటర్ అయితే ఏదో అనుకోవచ్చు. ఆ మధ్య రవితేజతో రావణాసుర, త్వరలో కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ చేయబోతున్న అభిషేక్ పిక్చర్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీలో చర్చకు వస్తుంది. ట్వీట్ ఉంచుతారా లేక ఇండస్ట్రీ పెద్దల సలహా మేరకు డిలీట్ చేస్తారా అనేది తెలియదు కానీ అభిషేక్ అడిగిన దాంట్లో లాజిక్ ఉంది. కాకపోతే నిర్మాణంతర వ్యవహారాలు ప్రొడ్యూసర్ కు సంబంధించినవి. హీరో ప్రమేయం ఒక పరిధి వరకే ఉంటుంది. ఈ పరిణామం ఎటు మలుపు తిరుగుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు
This post was last modified on September 6, 2023 8:29 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…