ఏది జరిగినా మన మంచికే అనే పెద్దలంటారు కానీ కొన్నిసార్లు ఈ సామెత పని చేయక రివర్స్ కొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. తనకు మొదట చెప్పినప్పుడే పవన్ కళ్యాణ్ కనక అతడు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చేసి ఉంటే వాటి బ్లాక్ బస్టర్ స్టేటస్ ఇండస్ట్రీ హిట్స్ ని మించి ఉండేది. కొన్ని మిస్ చేసుకోవడం మాత్రం మంచికే అనిపించే ఉదాహరణలు కూడా లేకపోలేదు. సాయిపల్లవికి మాత్రం ఇలాంటి నిర్ణయాలు మంచే చేస్తున్నాయనిపిస్తోంది. వాటిలో ఒకటి అల్ట్రా డిజాస్టర్ కాగా రెండోది విడుదలకు ముందే ట్రోలింగ్ కి టార్గెట్ అయిపోయింది.
మొదటిది భోళా శంకర్. కీర్తి సురేష్ చేసిన చెల్లెలి క్యారెక్టర్ ముందు సాయిపల్లవికే ఆఫర్ చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. రీమేక్స్ లో నటించకూడదని ముందే ఫిక్స్ కావడంతో చిరంజీవి సినిమా అయినా సరే నిర్మొహమాటంగా నో చెప్పేసింది. ఇప్పుడు దాని ఫలితం చూశాక ఎవరైనా ఏం మాట్లాడగలరు. రెండోది చంద్రముఖి 2. కంగనా రౌనత్ క్యారెక్టర్ ముందు తనకే వినిపించారు. అయితే సినీ చరిత్ర క్లాసిక్ పెర్ఫార్మన్సుల్లో ఒకటిగా నిలిచిన శోభన, జ్యోతిక స్థాయిలో తాను చేయలేనని, ఒకవేళ ఛాలెంజ్ గా తీసుకున్నా పోలికలతో లేనిపోని రాద్ధాంతం అవుతుందని నో అనేసింది.
చంద్రముఖి 2 హిట్టవ్వచ్చు కాకపోవచ్చు. కానీ ట్రోలింగ్ కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్ మాత్రం పెద్దదే ఉంది. ట్రైలర్ చూశాక ఇందులో ఎలాంటి కొత్తదనం లేదనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ఇది కొనసాగింపు కంటే రీమేకనే ఫీలింగ్ ఎక్కువ ఇచ్చింది. రజని స్థానంలో లారెన్స్ రావడం తప్ప పెద్దగా మార్పు లేదనే ఫీడ్ బ్యాక్ ఎక్కువ వినిపించింది. ఏ తేడా వచ్చినా కంగనాకు వచ్చే నష్టం ఏమి లేదు కానీ ఒకవేళ ఆ పాత్రలో సాయిపల్లవి ఉంటే మాత్రం అనవసరంగా టార్గెట్ అయ్యేది. నాగ చైతన్య చందూ మొండేటి కాంబో మూవీకి ఓకే చెప్పిందన్న వార్త వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on September 6, 2023 8:26 am
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…
ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…