ఇదేదో దేవుడి ఉపమానంలా అనిపిస్తుంది కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయంలో హీరో నవీన్ చూపిస్తున్న డెడికేషన్ చూస్తుంటే మాత్రం ఈ పదమే కరెక్ట్ అనిపిస్తుంది. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రమోషన్లకు రాలేని నిస్సహాయత వ్యక్తం చేసిన తరుణంలో భారం మొత్తం ఒక్కడి మీదే పడింది. పైగా మూవీలో ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ ఏదీ లేదు. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళ బొమ్మ చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేంత సీన్ లేదు. సో ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు కథానాయకుడిగా తానొక్కడే సెల్లింగ్ పాయింటని అర్థం చేసుకున్న నవీన్ సర్వం తనే అయిపోయాడు.
ఏపీ తెలంగాణలో ఇప్పటికే విస్తృతంగా టూర్లు కొట్టేశాడు. నేరుగా ప్రేక్షకులను కలుసుకున్నాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా నిర్మాతలు ఎక్కడ ప్లాన్ చేస్తే అక్కడ అలుపు లేకుండా తిరిగాడు. ప్రెస్ మీట్ లో సైతం మైకు తీసుకుని రజనీకాంత్ రోబోలా అన్ని ప్రశ్నలకు జవాబిచ్చే బాధ్యతను తీసుకున్నాడు. సంగీతం పరంగానూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ఛార్ట్ బస్టర్ లేదా వైరలయ్యే పాటలు పడలేదు. ఖుషి లాగా ఓ రెండు ట్రాక్స్ జనంలో రీచ్ అయ్యుంటే ఆడియన్స్ దృష్టి దీని మీద పడేది. కానీ ఆ ఛాన్స్ లేకపోయింది. ట్రైలర్ డీసెంట్ గా ఉండటం వల్ల అంచనాలొచ్చాయి.
దర్శకుడు మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాయింట్ తో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీసినట్టు ఇప్పటికైతే టాక్ ఉంది. సెప్టెంబర్ 7న డైనోసర్ లాంటి షారుఖ్ జవాన్ తో పోటీ ఉన్నప్పటికీ వేరే ఆప్షన్ లేక యువి క్రియేషన్స్ క్లాష్ కి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు వాయిదాలు జరిగిన నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఇబ్బందే కనక ఈ డేట్ కి కట్టుబడిపోయారు. అనుష్క మినహా నవీన్ పోలిశెట్టితో పాటు టీమ్ మొత్తం కలిసి చిరంజీవి సినిమా చూశాక బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మెగాస్టార్ వశిష్టల కాంబో మూవీని తెరకెక్కిస్తోంది యువినే కాబట్టి ఆ బాండింగ్ తో షో వేసి మరీ మెచ్చుకోలు అందుకున్నారు.
This post was last modified on %s = human-readable time difference 1:38 pm
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సమర్థించారు.…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…