ఇటీవలే సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలకు గురైన కోలీవుడ్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి వారసుడు, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ మీద హిందూ సంఘాలు ఏ స్థాయిలో విరుచుపడుతున్నాయో చూస్తున్నాం. కొన్ని పోలీస్ కేసులు ఆల్రెడీ నమోదవ్వగా కొందరు ఏకంగా అతని తల మీద కోట్ల రూపాయల నజరానాలు ప్రకటిస్తున్నారు. దేశంలో మెజారిటీ వర్గం పాటించే ఒక ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చడం ముమ్మాటికీ అభ్యంతకరమే. తాను వెనక్కు తగ్గనంటున్న స్టాలిన్ ఈ వివాదాన్ని ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు.
ఇక్కడే షారుఖ్ ఖాన్ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. జవాన్ విడుదల ముంగిట ఉన్న నేపథ్యంలో స్వయంగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ విజయం కోసం వేడుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే వైష్ణో దేవి గుడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కింగ్ ఖాన్ ఇవాళ ఏడుకొండలపైన కొలువున్న వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. తెల్లవారుఝామున టిటిడి నిర్దేశించిన సాంప్రదాయ దుస్తుల్లో సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. కూతురు సుహానా ఖాన్, హీరోయిన్ నయనతార, ఆవిడ భర్త విగ్నేష్ శివన్ షారుఖ్ తో పాటు పూజల్లో ఉన్నారు.
తాను ముస్లిం అయినప్పటికీ పరమత సహనాన్ని చక్కగా పాటించడమే కాక బిడ్డలకు కూడా నేర్పిస్తూ షారుఖ్ ఆదర్శంగా నిలుస్తుంటే స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతనం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. ఈ పోలిక సందర్భోచితంగా ఉంది. సినిమా సక్సెస్ కోసమే అయినా షారుఖ్ ఇంత కష్టపడి పుణ్యక్షేత్రాలు తిరగాల్సిన పని లేదు. ఉన్న చోట మొక్కుకున్నా సరిపోతుంది. అలా కాకుండా స్వయంగా వెళ్లడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ వల్ల సన్ నెక్స్ట్ యాప్ జనం తీసేసే పనిలో ఉండగా షారుఖ్ వల్ల జవాన్ బుకింగ్స్ ఇంకా ఊపందుకునేలా ఉన్నాయి
This post was last modified on September 5, 2023 11:44 am
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…
ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర…
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…
హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…