గత ఏడాది సాలిడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన డీజే టిల్లుకి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఒక లిరికల్ వీడియో బాగానే హిట్టయ్యింది. అయితే ఇవాళ హఠాత్తుగా సితార ఎంటర్ టైన్మెంట్స్ తరఫున సెప్టెంబర్ 15 తమ సినిమా రిలీజ్ చేయడం లేదని, దానికి క్షమాపణ కోరుతున్నామని, అతి త్వరలో అదిరిపోయే డేట్ తో మరింత కిక్ యాస్ స్టఫ్ తో మిమ్మల్ని పలకరిస్తామని చెప్పి ట్విట్టర్ వేదికగా ఒక అఫీషియల్ నోట్ వదిలారు. మంచి క్వాలిటీ కోసమే జాప్యం తప్పడం లేదని, చాలా ఎగ్జైట్ మెంట్ తో బెస్ట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇదంతా బాగానే ఉంది అసలు ఇంత హఠాత్తుగా టిల్లు క్షమాపణ ఎందుకు చెప్పాడనేది ఫ్యాన్స్ కి అర్థం కాని ప్రశ్న. సెప్టెంబర్ 15 ఈ సినిమా రావడం లేదని వారాల క్రితమే మీడియాతో సహా సామాన్య జనాలకూ తెలుసు. ఇందులో కొత్తేమీ లేదు. పైగా ఆ తేదీని లాక్ చేసుకున్న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ ట్రైలర్లతో సహా ప్రమోషన్ల వేగం పెంచాయి. అసలు బరిలోనే టిల్లు లేనప్పుడు ఇప్పుడు సడన్ గా పోస్ట్ పోన్ అనౌన్స్ మెంట్ ఏంటనే సందేహం రావడం సహజం. దీనికి కారణం లేకపోలేదు. టిల్లు స్క్వేర్ వాయిదాల పర్వం గురించి గత కొద్దిరోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది.
కొంత భాగం రీ షూట్ కోసం సిద్దు జొన్నలగడ్డ దర్శకుడు మల్లిక్ రామ్ ని ఒత్తిడి చేస్తున్నాడనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. పైగా అక్టోబర్ విడుదల కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడం టీమ్ లో ఆందోళన పెంచుతోందట. ఒకవేళ టైగర్ నాగేశ్వరరావు కనక వచ్చే నెల మొదటి వారంలో వస్తే టిల్లు స్క్వేర్ కి మధ్యలో ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దసరాకి ఇదే సితార బ్యానర్ కొన్న లియోతో పాటు బాలయ్య భగవంత్ కేసరి బరిలో ఉంటుంది. సో అప్పుడు నవంబర్ కు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. ఇదంతా నేరుగా చెప్పలేకే సారీ చెప్పేసి కమింగ్ సూన్ అని చెప్పేసినట్టు ఉన్నారు.
This post was last modified on September 5, 2023 12:32 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…