గత నెల విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ ఫైనల్ రన్ కు వచ్చేసింది. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్ కౌంట్ మైంటైన్ చేసిన ఈ సూపర్ స్టార్ మూవీకి గురువారం నుంచి వీడ్కోలు తప్పదు. అదే రోజు అన్ని భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరగనుండటంతో ఇకపై టికెట్లు కొని చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ తో సన్ పిక్చర్స్ కి కనక వర్షం కురిపించిన జైలర్ అటు తమిళనాడు కేరళలోనూ ముగింపుకొచ్చింది. ఇక తెలుగు వెర్షన్ సంగతి చూస్తే సెలవు తీసుకునే సమయానికి వామ్మో అనిపించే లాభాలు కళ్లజూసింది.
వరల్డ్ వైడ్ తెలుగు జైలర్ అక్షరాలా 42 కోట్ల లాభాన్ని ఇచ్చింది. థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్లకు చేయగా ఇంత మొత్తం వసూలు చేయడం ఎవరూ ఊహించనిది. వంద కోట్ల గ్రాస్ మార్కుకు కేవలం 2 కోట్ల దూరంలో ఆగిపోయిన సూపర్ స్టార్ దాన్ని అందుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం కానీ జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ది నన్ 2 విడుదల నేపథ్యంలో ఆ మాత్రం ఆశించడం కూడా కష్టమే అనిపిస్తోంది. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 2 కోట్ల దాకా షేర్ రాగా ఓవర్సీస్ లోనూ జైలర్ తెలుగు 5 కోట్లకు పైగా రాబట్టుకోవడం విశేషం. ఇవన్నీ కొత్త రికార్డులుగానే చెప్పుకోవాలి.
ఇకపై రజనీకాంత్ సినిమాలకు ఆటోమేటిక్ గా బిజినెస్ ఫిగర్స్ పెరిగిపోతాయి. ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సలామ్ ని ఇరవై కోట్ల దాకా అడగొచ్చని చెన్నై టాక్. అయితే ప్రతిసారి జైలర్ లాంటి ఫలితాలే రిపీట్ కావు కాబట్టి బయ్యర్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో కేవలం రజని ఇమేజ్ నే గుడ్డిగా నమ్ముకుని కాలా, కబాలి, దర్బార్ లాంటి వాటి మీద కోట్లు కుమ్మరించిన నిర్మాతలు వాటి వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఏదైతేనేం రజనీకాంత్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ ని.
This post was last modified on September 5, 2023 12:29 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…