సినిమాల్లో నటన పరంగా అయినా.. స్టేజ్ మీద ప్రసంగాల విషయంలో అయినా.. సినిమాలను ప్రమోట్ చేసే తీరులో అయినా విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. అతను ఏం మాట్లాడినా… ఏం చేసినా సెన్సేషన్ అవుతుంటుంది. గీత గోవిందం ప్రి రిలీజ్ ఈవెంట్లో తన మీద వచ్చిన ట్రోల్స్‌ను స్టేజ్ మీద ప్రదర్శింపజేయించినా.. ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ కోసం థియేటర్‌కు వెళ్లి క్యాంటీన్ బిల్ అంతా తనే చెల్లించినా.. విజయ్‌కే చెల్లింది. ఇప్పుడు విజయ్ తన మార్కు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు.
తన సంపాదనలో అభిమానులకు కూడా భాగం ఉందని పేర్కొంటూ.. వారి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు విజయ్. ఈ మేరకు ఖుషి సక్సెస్ మీట్లో అతను ప్రకటన చేశాడు. తన ఎదుగుదలలో అభిమానుల పాత్రను గుర్తు చేస్తూ.. వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంటూ.. తన మీద ఇంత ప్రేమ చూపించే అభిమానులకు తన సంపాదనను పంచాలని నిర్ణయించుకున్నట్లు ఖుషి ఈవెంట్లో విజయ్ ప్రకటించాడు. అందుకే తన ఆదాయంలో కోటి రూపాయలు వారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు.
వంద మంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబాలకు తలో లక్ష రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు విజయ్ వెల్లడించాడు. ఈ ఎంపిక ఎలా ఉంటుంది.. డబ్బులు ఎలా పంచుతారు అనే విషయాలను తన టీం చూసుకుంటుందని.. దాని వివరాలు తర్వాత వెల్లడిస్తానని విజయ్ పేర్కొన్నాడు. ఈ ప్రకటనకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. విజయ్ మాత్రమే ఇలా చేయగలడంటూ అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on September 5, 2023 12:26 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…