Movie News

ఇప్పటిదాకా ఖుషీ ఇకపై ఛాలెంజ్

విజయ్ దేవరకొండ ఖుషి మొదటి వీకెండ్ ని ఘనంగా ముగించింది. వరల్డ్ వైడ్ 70 కోట్లకు పైగా గ్రాస్ తో మంచి ఫిగర్స్ నమోదు చేయగా యుఎస్ లో 1.4 మిలియన్ డాలర్లతో బ్రహ్మాండంగా దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నైజామ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండగా సీడెడ్, ఆంధ్రలో అంత దూకుడు లేదు. అయినా సరే నిన్న ఆదివారం దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ బాగానే నమోదయ్యాయి. పోటీ లేని వాతావరణాన్ని ఖుషి బాగా వాడుకుంది. అందుకే హైదరాబాద్ కాకుండా వైజాగ్ లో సక్సెస్ మీట్ చేయాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నారు మైత్రి మేకర్స్.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఖుషికి అసలు అగ్నిపరీక్ష ఈ రోజు అంటే సోమవారం నుంచి మొదలుకానుంది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే వీక్ డేస్ లో డ్రాప్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది మరీ తీవ్రంగా ఉండకపోవడం కీలకం. బేబీకి మండే కూడా సోల్డ్ అవుట్ బోర్డులు పడిన విషయం మర్చిపోకూడదు. ఖుషికి అంత యూనానిమస్ టాక్ వచ్చి ఉంటే అదే జరిగేది కానీ జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల మెట్రో స్పీడ్ కు బదులు ఎక్స్ ప్రెస్ వేగంలో వెళ్తోంది. రేపు సాయంత్రానికి ఈ ట్రెండ్ మీద ఒక స్పష్టమైన అవగాహనకు రావొచ్చు.

ఇక ఈ వారం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వస్తోంది. విపరీతమైన హైప్ లేదు కానీ మార్నింగ్ షో టాక్ మీద ఆధారపడి నవీన్ పోలిశెట్టి ఒక్కడే ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. అనుష్క ఎందుకు రావడం లేదనే కారణం చూచాయగా తెలిసినా యూనిట్ నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. హైప్ తేవడంతో ట్రైలర్ కొంతవరకు మంచి పాత్రే పోషించింది కానీ ఇలాంటి వాటికి కీలకంగా పని చేయాల్సిన ఆడియోకి అంత రీచ్ రాలేదు. ఇక షారుఖ్ ఖాన్ జవాన్ బుకింగ్స్ మాత్రం అరాచకం అనిపించేలా జరుగుతున్నాయి. వీటి మధ్యలోనే ఖుషి పికప్ అందుకుని జోరు చూపించాల్సి ఉంటుంది.

This post was last modified on September 4, 2023 1:40 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

8 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

33 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

43 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago