విజయ్ దేవరకొండ అనే అనామక కుర్రాడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నేళ్ల వ్యవధిలో పెద్ద స్టార్ అయిపోవడం టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే ఒక వేదిక మీద ఈ విషయంపై మాట్లాడాడు. తాను స్టార్ ఇమేజ్ సంపాదించడానికి చాలా ఏళ్లు పట్టిందని.. కానీ విజయ్ చాలా వేగంగా ఈ స్థాయిని అందుకున్నాడని ఆయన కొనియాడాడు.
సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టే కొత్త హీరోలందరికీ విజయ్ ఆదర్శం అనడంలో సందేహం లేదు. అదే సమయంలో విజయ్‌ని చూసి అసూయ చెందే వాళ్లు కూడా లేకపోలేదు. కొందరు యంగ్ హీరోలు ఆంతరంగిక సంభాషణల్లో విజయ్ మీద విమర్శలు చేస్తుంటారన చర్చ కూడా గతంలో జరిగింది. కొందరు పరోక్షంగా విజయ్‌ని ఉద్దేశించి వేసిన కౌంటర్లు కూడా డిస్కషన్‌కు దారి తీశాయి.
ఇదంతా ఒకెత్తయితే.. విజయ్ సినిమాల మీద అదే పనిగా సోషల్ మీడియాలో నెగెటివిటీని స్ప్రెడ్ చేసే బ్యాచ్‌లు కూడా లేకపోలేదు. ‘డియర్ కామ్రేడ్’ టైంలో ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. ఆ సినిమా మరీ అంత పెద్ద డిజాస్టర్ కావాల్సిన మూవీ అయితే కాదు. కానీ విపరీతంగా నెగెటివిటీ వచ్చి సినిమా దారుణంగా దెబ్బ తింది. కట్ చేస్తే ఇప్పుడు విజయ్ కొత్త చిత్రం ‘ఖుషి’ని దెబ్బ తీయడానికి కుట్ర జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఖుషి’ సినిమాకు బుక్ మై షోలో 7కు అటు ఇటుగా రేటింగ్ వచ్చింది. నిజానికి పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు ఇంకా బెటర్ రేటింగే ఉండాలి బుక్ మై షోలో. ఐతే బుక్ మై షోలో రేటింగ్ తగ్గడం వెనుక ఒక స్టార్ హీరో పీఆర్వో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. దాదాపు పది వేల బోట్స్ అకౌంట్ల ద్వారా సింగిల్ స్టార్ రేటింగ్ ఇప్పించి ఓవరాల్ రేటింగ్ తగ్గేలా చేశారని అంటున్నారు. సినిమా మీద దారుణంగా విమర్శలు గుప్పిస్తూ ఒకే రకమైన రివ్యూలతో లో రేటింగ్స్ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం.
This post was last modified on September 3, 2023 8:11 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…