ఎప్పుడైతే సలార్ వాయిదా పడిందో అప్పటి నుంచి చాలా మంది నిర్మాతలకు నిద్ర పట్టడం లేదు. తాము ఫిక్స్ చేసుకున్న డేట్ కి వస్తే మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుందోననే ఆందోళన చుట్టుముడుతోంది. హోంబాలీ ఫిలిమ్స్ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న పరిణామాలు ఎన్నో చర్చలకు దారి తీస్తున్నాయి. ఉలుకు పలుకు లేకుండా ఉన్న ప్రొడక్షన్ హౌస్ ని ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. బుక్ మై షోలో మారిన నెల చూపిస్తోంది కానీ నిర్మాణ సంస్థ హ్యాండిల్ లో మాత్రం ఏ అప్డేట్ లేదని కస్సుమంటున్నారు.
ఇదిలా ఉండగా దీపావళిని టార్గెట్ చేసుకుని సలార్ నవంబర్ 3 లేదా 10న రావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ నెలలో నోటబుల్ రిలీజులు గట్టిగానే ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, కార్తీ జపాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3, అజయ్ భూపతి మంగళవారం, కళ్యాణ్ రామ్ డెవిల్, కంగనా రౌనత్ ఎమెర్జెన్సీ ఇవన్నీ ఆ టైంలో షెడ్యూల్ చేసుకున్నవే. సలార్ వస్తే ఇవన్నీ తప్పుకోవాలని రూల్ లేదు. కానీ ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ కనీసం రెండు మూడు వారాల పాటు ఉంటుంది కాబట్టి ఆ కోణంలో టెన్షన్ పడుతున్నారు.
నిజానికి దీపావళి పండగ టాలీవుడ్ కు మరీ అంత కీలకం కాదు. సంక్రాంతి, దసరా తరహాలో మనకు భారీ వర్కౌట్ అవ్వడం తక్కువ. కానీ సలార్ లాంటి వాటికీ సీజన్ తో సంబంధం లేదు కనక ఎప్పుడొచ్చినా ఒకటే. అయితే ప్యాన్ ఇండియా రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా బాలీవుడ్ లో క్లాష్ లేని సమయం చూసుకుని డేట్ లాక్ చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. నిన్న కిచ్చ సుదీప్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన హోంబలే దాని కింద కామెంట్స్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత దుమ్మెత్తిపోసినా బదులిస్తే ఒట్టు.
This post was last modified on September 3, 2023 5:46 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…