కలెక్షన్ల పరంగా రికార్డులంటే ఎప్పుడూ హీరోల గురించే చర్చ జరుగుతుంటుంది. హీరోల ఫ్యాన్స్ మధ్యే ఈ విషయంలో పోటీ కనిపిస్తుంటుంది. వాదోపవాదాలు నడుస్తుంటాయి. హీరోయిన్లను రికార్డుల విషయంలో అస్సలు కన్సిడర్ చేయరు. ఐతే రికార్డుల తాలూకు క్రెడిట్లో మేజర్ షేర్ హీరోయిన్లకు రాకపోవచ్చు కానీ.. వాళ్ల పాత్రా ఎంతో కొంత ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ కోణంలో చూస్తే సమంత సాధించిన ఓ రికార్డును ఇండియాలో మరే హీరోయిన్ కానీ.. హీరో కానీ కొట్టే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు.
యుఎస్‌లో ఏకంగా 17 మిలియన్ డాలర్ మూవీస్‌లో సమంత భాగం కావడం విశేషం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇన్నిసార్లు ఈ మార్కును అందుకోలేదు. తాజాగా ‘ఖుషి’ మూవీతో సామ్ మరోసారి ఈ క్లబ్బులోకి అడుగు పెట్టింది. టాలీవుడ్లో తొలి మిలియన్ డాలర్ మూవీ ‘దూకుడు’లో సమంతనే హీరోయిన్ కావడం విశేషం. ఆ తర్వాత ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, 24, బ్రహ్మోత్సవం, అఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ.. ఇలా సామ్ నటించిన చాలా చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టాయి.
తాజాగా ‘ఖుషి’ విడుదలైన రెండు రోజులకే మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. ‘అఆ’, ‘మజిలీ’ లాంటి చిత్రాల విజయంలో సమంత పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. తాజాగా ‘ఖుషి’లో కూడా సామ్‌ది ముఖ్య పాత్ర. సమంత నటించిన యుటర్న్, ఓ బేబీ, యశోద లాంటి కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా యుఎస్‌లో బాగా ఆడాయి. తెలుగులో సమంతలా ప్రేక్షకులను సొంతంగా థియేటర్లకు పుల్ చేసే స్థాయిని చాలా కొద్దిమంది హీరోయిన్లే అందుకున్నారు. కాకపోతే ‘ఖుషి’లో సామ్ లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావట్లేదు.
This post was last modified on September 3, 2023 5:19 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…