సలార్ రిలీజ్ నెలలోకి అడుగు పెట్టేశామంటూ అభిమానులు ఎంతో ఉత్సాహంగా కౌంట్ డౌన్ మొదలుపెట్టిన సమయంలోనే వారికి పెద్ద షాక్ తగిలింది. ఈ నెల 28న ఈ భారీ చిత్రం విడుదల కాదన్న వార్త వారిని విస్మయానికి గురి చేసింది. ఇది జస్ట్ రూమర్ అనుకున్నారు కానీ.. తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే వాయిదా వాస్తవం అని రూఢి అయిపోయింది. ‘సలార్’ యుఎస్ ప్రిమియర్స్ షోల టికెట్ల అమ్మకాలు ఆగిపోయాయి. ‘సలార్’ డేట్‌కు రావడానికి వేరే చిత్రాలు సై అంటే సై అని రెడీ అవుతున్నాయి. మొత్తానికి ‘సలార్’ ఈ నెలలో రాదని తేలిపోయింది.
ఇంతకీ ‘సలార్’ను తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ఏ డేట్ చూసినా.. ఇప్పుడున్నంత అనుకూలంగా లేదు. దాని చుట్టూ ఏదో ఒక తలనొప్పి తప్పట్లేదు. అక్టోబరులో అయితే సినిమాను రిలీజ్ చేసే అవకాశం లేదు. సినిమాను పక్కాగా రెడీ చేయాలంటే ఇంకో రెండు నెలలైనా సమయం కావాలి. కాబట్టి నవంబరు నుంచి డేట్లు పరిశీలిస్తున్నారు. ముందు క్రిస్మస్, సంక్రాంతి అని చర్చ జరిగింది కానీ.. సినిమాను మరీ అంత వెనక్కి తీసుకెళ్లడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు.
పైగా క్రిస్మస్‌కు షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకి’ వచ్చే అవకాశాలున్నాయి. వివిధ భాషల్లో వేరే చిత్రాలు చాలానే క్రిస్మస్‌కు షెడ్యూల్ అయ్యాయి. ఈ ఒక్క సినిమా కోసం చాలా డేట్లు మారాల్సి ఉంటుంది. అంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్టా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సంక్రాంతి సంగతి కూడా ఇంతే. తెలుగులో ఆ పండుగ మీద చాలా ముందే కర్చీఫ్ వేసిన సినిమాలు ఉన్నాయి. వాళ్లందరినీ ఇబ్బంది పెట్టలేరు. పైగా సంక్రాంతి అనేది నార్త్ ఇండియాలో కలిసొచ్చే సీజన్ కాదు. కాబట్టి నవంబరులో రావడమే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ దీపావళి అంటే తెలుగు వాళ్లకు కలిసొచ్చే సీజన్ కాదు. పైగా బాలీవుడ్లో ‘టైగర్-3’ లాంటి భారీ చిత్రం రిలీజవుతోంది.
సల్మాన్ సినిమాకు ఎదురెళ్తే నార్త్ ఇండియాలో చాలా కష్టమవుతుంది. అదే సమయంలో సల్మాన్ సినిమాకు సౌత్‌లో గట్టి దెబ్బ తగులుతుంది. ఎప్పుడో షెడ్యూల్ అయిన భారీ చిత్రానికి ప్రభాస్ సినిమాను పోటీగా నిలిపితే బాలీవుడ్ జనాలు ఊరుకోరు. కాబట్టి ‘టైగర్-3’కి రెండు వారాలు విడిచిపెట్టి.. నవంబరు 24న రిలీజ్ చేయడం ఉన్నంతలో మంచి ఆప్షన్ అనుకుంటున్నారు. కానీ వారం తర్వాత ‘యానిమల్’ లాంటి క్రేజీ మూవీతో దీనికి పోటీ తప్పదు. అయినా సరే.. సర్దుబాటు చేసుకుని నవంబరు చివరి వారానికి ఫిక్సయ్యే ఛాన్సులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 3, 2023 2:44 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…