ఇవాళ వచ్చిన ఓజి టీజర్ తమన్ అభిమానులే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యేలా చేసింది. ఇప్పటి జనరేషన్ కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇస్తే ఎక్కుతుందో సరిగ్గా ఆ స్టైల్ లోనే కంపోజ్ చేసిన తీరు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఓ రేంజ్ గూస్ బంప్స్ ఇచ్చింది. బ్రో విషయంలో సరిగా వర్క్ చేయలేదని అసంతృప్తిగా ఉన్న మూవీ లవర్స్ కి ఇప్పుడీ వీడియో హమ్మయ్య అనుకునేలా చేసింది. కొంచెం కమల్ హాసన్ విక్రమ్ స్టైల్ లో అనిపించినా ఎలివేషన్లకు ఢోకా లేకుండా అదిరిపోయే చిన్న పాటను మిక్స్ చేయడంతో మరింత ప్లస్ అయ్యింది. సుజిత్ చక్కగా రాబట్టుకున్నాడు.
ఇప్పుడు ఆరుగురు హీరోల ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు. మొదటిది రామ్ స్కంద. దర్శకుడు బోయపాటి శీనుకి మరోసారి అదిరిపోయే బిజిఎంతో బెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. నెక్స్ట్ బాలకృష్ణ భగవంత్ కేసరి. ఈసారి అఖండని మించిన స్కోర్ ఇస్తాడని దీని మీద మాములు అంచనాలు లేవు. ఆపై మహేష్ బాబు గుంటూరు కారం. తమన్ ని మారుస్తారేమో అనే రేంజ్ లో ప్రచారం జరిగాక నిలబెట్టుకున్న అవకాశం కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వాల్సిందే. తర్వాతది రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఇప్పటిదాకా ఒక్క టీజర్ కానీ, లిరికల్ వీడియో కానీ రాలేదు.
ఓ ఇంటర్వ్యూలో డబుల్ ఎక్స్ ఎల్ రేంజ్ లో ఉంటుందని ఊరించడం తప్పించి ఎలాంటి స్టఫ్ వదల్లేదు. ప్రభాస్ మారుతీల ప్యాన్ ఇండియా మూవీ ఇంకో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ట్యూన్ల కంపోజింగ్, చిత్రీకరణ మొదలుపెట్టేశారు. పుష్ప 2 అయ్యాక అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ కూడా తమన్ కే వచ్చి చేరింది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ ఓజితో పాటు సురేందర్ రెడ్డి తీయబోయే భారీ చిత్రం కూడా తన ఖాతాలోకే వచ్చేలా ఉంది. పవర్ స్టార్ దగ్గర అంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఇన్నేసి చేతిలో ఉండటం బాగానే ఉంది కానీ ఎవరిని నిరాశపరచకుండా ఆల్బమ్స్ ఇవ్వడం తమన్ బాధ్యత.
This post was last modified on September 2, 2023 11:20 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…