Allu Arjun
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. పుష్ప 2 ది రూల్ మీద ఒక్కసారిగా అంచనాలు ఇంకాస్త పైకెళ్ళాయి. రెండు పురస్కారాలు దక్కడంతో సుకుమార్ కూడా మరింత శ్రద్ధ సరైన ప్లానింగ్ తో ఉన్న స్క్రిప్ట్ ని మరింత పక్కాగా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. 2024 మార్చి 22 విడుదలనే లీక్ వచ్చింది కానీ ఆ డెడ్ లైన్ ఖచ్చితంగా చేరుకోవడం గురించి సుక్కు ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారట. అందుకే అఫీషియల్ గా రిలీజ్ డేట్ గురించి ప్రకటించడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు.
మరి పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా అనే విషయంలో మొదటి ప్లేస్ ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇదయ్యాక చేయాల్సిన సినిమా కూడా బన్నీ లాక్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తమిళ దర్శకుడు ఆట్లీ చెప్పిన లైన్ నచ్చడంతో త్వరలోనే ఫైనల్ వెర్షన్ వినేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. బ్యానర్ గట్రా వివరాలు తెలియదు కానీ కమర్షియల్ జానర్ ని డీల్ చేయడంతో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న ఆట్లీ ఏకంగా షారుఖ్ ఖాన్ తో పిలుపందుకుని జవాన్ ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
దాని ఫలితం గురించి ఎలాగూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీ వైపు బన్నీ సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టార్ హీరోలు తమ దర్శకుల కాంబోలను చాలా అడ్వాన్స్ గా లాక్ చేసుకునే పరిస్థితులు ఉండటంతో త్రివిక్రమ్ తో పాటు అట్లీకి కమిట్ మెంట్ ఇచ్చేస్తే అల్లు అర్జున్ కు2025 వరకు మళ్ళీ ఆలోచించాల్సిన పని ఉండదు. ఇప్పటికే పలు బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు సంప్రదింపుల్లో ఉండగా హిందీ డెబ్యూ గురించి బన్నీ తొందరపడేలా లేడు. ఏదైనా సరే సౌత్ దర్శకులతో చేసి వాటినే ప్యాన్ ఇండియా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
This post was last modified on September 2, 2023 4:55 pm
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…