ఇంకో అయిదు రోజుల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదలవుతోంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కని తెరమీద చూడబోతున్న అభిమానులు దీని మీద పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ హీరో నవీన్ పోలిశెట్టి అంతా తానై ఊరూరా తిరిగి ప్రమోషన్ చేస్తున్నాడు. అయితే ఉండాల్సిన రేంజ్ లో హైప్ లేదనే విషయం సోషల్ మీడియా ట్రెండ్స్ చూసినా అర్థమవుతుంది. మీడియా, అభిమానుల ముందుకు రావడానికి అనుష్క ఇష్టపడకపోవడం వల్ల భారం మొత్తం నవీన్ మోయాల్సి వచ్చింది. వీళ్లిద్దరు తప్ప ఇంకే అట్రాక్షన్ ఈ సినిమాకు లేదనేది నిజం.
ఇంత తక్కువ టైం ఉన్నప్పుడు పబ్లిసిటీ స్పీడ్ పెంచాలి. జనంలో ఆసక్తి కలిగేలా హంగామా జరగాలి. కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలతో పనవ్వదు. అసలే అవతల పోటీలో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో కళ్ళముందు కనిపిస్తోంది. హిందీ సినిమా అయినా సరే తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ఇస్తుండటంతో సాధారణ ప్రేక్షకులు సైతం చూడొచ్చనే ప్లాన్ లో ఉన్నారు. అలాంటప్పుడు దాని మీద దృష్టిని తనవైపు మళ్ళించుకోవడం మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టికి అంత సులభంగా ఉండదు.
ఒక డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో భర్త లేకుండా పిల్లల్ని కోరుకునే పాత్రలో అనుష్క, జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకునే స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి విభిన్నమైన పాత్రలే చేశారు. అసలే సెప్టెంబర్ 15న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లాంటివి ఉన్నాయి. వాటికి ధీటుగా రెండో వారం కొనసాగాలంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికికి బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. దానికన్నా ఎం ముందు మంచి ఓపెనింగ్స్ దక్కాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఏదో ఉందన్నారు కానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు. విడుదల దగ్గరగా ఉన్న తరుణంలో శెట్టి జంట అర్జెంటుగా స్పీడ్ పెంచాల్సిందే.
This post was last modified on September 2, 2023 2:32 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…